Home > Movies - Movie News
మహేష్ మైల్ స్టోన్ మూవీకి డేట్ ఫిక్స్

తన కెరీర్ లో 25వ మైల్ స్టోన్ మూవీకి చేరువయ్యాడు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమా ఎప్పట్నుంచి సెట్స్ పైకి వస్తుందనే విషయంపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి మహేష్ 25వ సినిమా సెట్స్ పైకి వస్తుందని ప్రకటించాడు.

కంప్లీట్ అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట ఈ సినిమా. లొకేషన్లకు సంబంధించి 2వారాల పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి అమెరికాలో పర్యటిస్తాడట. సినిమా స్టోరీలైన్ ను ఇప్పటికే లాక్ చేసిన ఈ దర్శకుడు.. కొంతమంది రైటర్స్ తో కూర్చొని డైలాగ్స్, స్క్రీన్ ప్లేపై వర్కవుట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం స్పైడర్ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు మహేష్. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు. కొరటాల సినిమా కంప్లీట్ అయిన తర్వాత దాదాపు నెల రోజులు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించాడు. ఆ తర్వాతే వంశీ పైడిపల్లి సినిమా స్టార్ట్ అవుతుంది.