Home > Movies - Movie News
రెండు సినిమాల మధ్య గ్యాప్ ఒకే ఒక్క రోజు

ఓ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మినిమం గ్యాప్ తీసుకోవడం మహేష్ కు అలవాటు. కుదిరితే ఆ ఖాళీ సమయంలో కొన్ని యాడ్స్ పూర్తిచేస్తాడు. లేదంటే కొడుకు, కూతురు, భార్యను తీసుకొని విదేశాలకు వెళ్తాడు. కానీ ఈసారి ఆ రెండూ జరగడం లేదు. మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.

ఈ రోజుతో స్పైడర్ టాకీ కంప్లీట్ అయిపోతుంది. ఈ టాకీ తర్వాత రేపు ఒక్క రోజు మాత్రమే గ్యాప్ తీసుకుంటున్నాడు మహేష్. ఎల్లుండి (జూన్ 21) నుంచి కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.

కొరటాల శివ, మహేష్ కాంబినేషన్ లో "భరత్ అనే నేను" సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది కానీ మహేష్ మాత్రం ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఎట్టకేలకు ఎల్లుండి నుంచి కొరటాల శివ సినిమాను ప్రారంభించబోతున్నాడు మహేష్.

కొరటాల, మహేష్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ అయింది. మహేష్ బాల్యానికి చెందిన సీన్లు తెరకెక్కించారు. ఇక 21 నుంచి మహేష్ పై అసెంబ్లీకి సంబంధించిన సీన్లు చిత్రీకరించబోతున్నారట. ఈ మేరకు భారీ అసెంబ్లీ సెట్ కూడా రెడీ అయింది.

కొరటాల శివ సినిమాలో పాల్గొంటూనే, స్పైడర్ పాటల షూటింగ్ కంప్లీట్ చేస్తాడు మహేష్. ఆ పాటలు కంప్లీట్ అయిన తర్వాత కొరటాల మూవీకి సంబంధించి లండన్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది.