Advertisement


Home > Movies - Movie News
మహేష్ టైటిల్, ఫస్ట్ లుక్ ఒకేసారి

మహేష్ – మురగదాస్ సినిమా టైటిల్ మీద ఆసక్తి అలా కొనసాగుతూనే వుంది. అయితే ఈ సస్సెన్స్ ఇక ఎన్నాళ్లో వుండడం లేదు. ఈ నెలాఖరకు అంటే ఉగాదికి కాస్త అటుగా లేదా ఇటుగా సినిమా టైటిల్, సూపర్ ఫస్ట్ లుక్ వచ్చేస్తున్నాయి.  టైటిల్ గురించి వస్తున్న ప్రెషర్, సినిమాకు బజ్ జారిపోకుండా చూసుకోవాలన్న విషయం హీరో మహేష్ బాబు దృష్టికి వెళ్లిందట. దాంతో ఆయన టైటిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అయితే ఇప్పుడు ఏమాత్రం లీక్ అయినా, మళ్లీ బాగుంది, బాగాలేదు, లైక్ లు, డిజ్ లైక్ లు ఇలాంటి వ్యవహారాలు వుంటాయి. సంభవామి విషయంలో అదే జరిగింది. అందుకే ఒకేసారి అనౌన్స్ చేసేయాలని డిసైడ్ అయ్యారట. ఫస్ట్ లుక్ కచ్చితంగా ఎక్స్ ట్రార్డినరీగా వుండేలా చూస్తున్నారు. ఆలుక్, ఈ టైటిల్ ఒకేసారి బయటకు వస్తాయట.

వియత్నాంకు మహేష్

ఇదిలా వుంటే సినిమా షూట్ కోసం ఈనెల 24న మహేష్ అండ్ యూనిట్ అంతా కలిసి వియత్నాం వెళ్తున్నారు. ఈ సినిమా క్లయిమాక్స్ రోలర్ కోస్టర్ లో జరుగుతుందని ఇంతకు ముందే వెల్లడించాం. అందుకోసమే వియత్నాం వెళ్తున్నారు. అక్కడ లైవ్ లొకేషన్స్ లో కొన్ని షాట్స్ తీసి, తిరిగి ఇక్కడకు వచ్చి, సెట్ లో మిగిలిన షాట్స్ తీసి మిక్స్ చేస్తారు. ఏప్రియల్ ఎండ్ కు దాదాపు వర్క్ అంతా పూర్తయిపోతుందని, మే నెల అంతా పోస్ట్ ప్రొడక్షన్ కు కేటాయిస్తారని తెలుస్తోంది.