Advertisement


Home > Movies - Movie News
తిరిగితే తప్పేంటి: హాట్ బ్యూటీ ఎదురు ప్రశ్న

హీరో రణబీర్ కపూర్ తో చాలా క్లోజ్ గా ఉంటూ, అతడితో కలిసి సిగరెట్ తాగుతూ కెమెరాకు దొరికిపోయింది బాలీవుడ్ హీరోయిన్ మహిరా ఖాన్. అప్పట్నుంచి మీడియాకు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్న ఈ బ్యూటీ, ఎట్టకేలకు ఆ మేటర్ పై స్పందించక తప్పలేదు.

తన సినిమా ట్రయిలర్ లాంచ్ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన మహిరా.. రణబీర్ తో సాన్నిహిత్యంపై చాలా ఓపెన్ గా మాట్లాడింది. తారల వ్యక్తిగత విషయాలకు మీడియా దూరంగా ఉంటే మంచిదని సూచించిన మహిరా.. నేను ఎవరితో కలిసి తిరిగితే మీకేంటని ఎదురు ప్రశ్నించింది. 

ఆ ఫొటోలో సిగరెట్ తాగడం, బ్యాక్ కనిపించేలా డ్రెస్ వేసుకున్న విధానంపై మహిరాపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. దానిపై స్పందించిన ఈ బ్యూటీ.. సిగరెట్ తాగడం తప్పనే విషయం తెలుసని... కానీ డ్రెస్సింగ్ విషయంలో మాత్రం ఎలా ఉండాలో తనకు సలహాలు ఇవ్వొద్దని కాస్త గట్టిగానే చెప్పుకొచ్చింది. 

మొత్తమ్మీద రణబీర్ కపూర్ తో ఇకపై కూడా క్లోజ్ గానే ఉంటానని పరోక్షంగా చెప్పుకొచ్చింది ఈ చిన్నది. మరోవైపు రణబీర్ మాత్రం తనకు మహిరాకు మధ్య ఎఫైర్ ఉందంటూ వార్తలు రాయొద్దని మీడియాను రిక్వెస్ట్ చేయడం విశేషం.