Home > Movies - Movie News
మళ్ళీ అదే మాట: అలా చూసే కళ్ళదే తప్పు

మితిమీరిన ఎక్స్‌పోజింగ్‌ చేసెయ్యడం.. సెన్సార్‌ కత్తెర వేటుకి ఆయా సీన్లు తెగిపడ్డం మామూలే. సినిమాల్లో సెన్సార్‌ కటింగులుంటాయి.. అవీ అరుదుగా మాత్రమేననుకోండి.! సోషల్‌ మీడియాకి సెన్సార్‌ వుండదు కదా.! అందుకే, అందాల భామలు సోషల్‌ మీడియా వేదికగా గ్లామర్‌లో రెచ్చిపోతున్నారు. పైగా, అదో రకమైన 'కళ' అంటూ తమ అందాల విందుకు కొత్త నిర్వచనం చెబుతున్నారు. 

ఈ లిస్ట్‌లో ఇప్పటికే చాలామంది అందాల భామలు చేరిపోగా, తాజాగా క్లాసులు పీకే క్లబ్‌లోకి చేరిపోయింది సీరత్‌కపూర్‌. 'రన్‌ రాజా రన్‌' సినిమాలో క్యూట్‌గా హాట్‌గా కన్పించిన సీరత్‌ కపూర్‌, ఆ తర్వాత 'టైగర్‌' సినిమాలో నటించి పరాజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా 'రాజుగారి గది-2' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఈ బ్యూటీ, ఈ సినిమాలో బికినీలో కన్పించనున్న విషయం విదితమే. 

సినిమాల సంగతి పక్కన పెడితే, సోషల్‌ మీడియాలో సీరత్‌ గ్లామర్‌కి ఆకాశమే హద్దు. పూనమ్‌ పాండే లాంటి సెక్స్‌బాంబ్స్‌తో పోటీపడేలా సీరత్‌, సోషల్‌ మీడియా వేదికగా అందాల ప్రదర్శనకు తెరలేపింది. 'అంత హాట్‌నెస్‌ అవసరమా.?' అని ప్రశ్నిస్తే, 'చూసే కళ్ళలోనే తప్పుంది.. సరిగ్గా చూస్తే, ఆ ఫొటోల్లో భావం అర్థమవుతుంది..' అంటూ సెలవిచ్చింది సీరత్‌ కపూర్‌. 

సీరత్‌ చెబుతోన్న కళాఖండాల్లో 'కళ' సంగతేమోగానీ, వల్గారిటీ ఓవర్‌లోడ్‌ అన్పించకమానదు. మీక్కూడా అలాగే అన్పిస్తోందా.? అయితే, సీరత్‌ కళ్ళతో ఇంకోసారి చూడండి, ఆమె చెబుతున్నట్లుగా ఇంకేదన్నా 'భావం' ఆ ఫొటోల్లో కన్పిస్తుందేమో.!