Home > Movies - Movie News
రామ్ చరణ్ తో కచ్చితంగా సినిమా చేస్తా, కానీ..!

చెలియా సినిమా డిజాస్టర్ అయినప్పుడే రామ్ చరణ్ లిస్ట్ లోంచి డిలీట్ అయ్యాడు దర్శకుడు మణిరత్నం.  కాకపోతే సినిమా ఉందంటూ మొన్నటివరకు ఓ వర్గం తెగ ప్రచారం చేసింది.

సుకుమార్ సినిమా తర్వాత మణిరత్నం మూవీనే ఉంటుందంటూ ఊదరగొట్టింది. అయితే తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా ఓకే చేయడంతో ఈ ఊహాగానాలు ఆగిపోయాయి. ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించాడు దర్శకుడు మణిరత్నం.

“ఇప్పటికిప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేయలేకపోవచ్చు. కానీ కచ్చితంగా అతడితో ఓ సినిమా ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడనేది చెప్పలేదు”. మణిరత్నం రియాక్షన్ ఇది.

మణిరత్నంతో సినిమా లేదని రామ్ చరణ్ కూడా చెప్పడం లేదు. మొన్నటికిమొన్న దర్శకుడు ఆడియో ఫంక్షన్ కు వచ్చినప్పుడు మణిరత్నంతో సినిమా ఉంటుందని ఆఫ్ ది రికార్డు చెబుతున్నాడు చరణ్. కాకపోతే వీళ్లిద్దరి కాంబినేషన్ ఇప్పట్లో సెట్స్ పైకి రాదనే విషయంపై మాత్రం కొరటాల సినిమా ద్వారా క్లారిటీ వచ్చేసింది.