Home > Movies - Movie News
హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న మెగాఫ్యాన్స్

మెగాఫ్యాన్స్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. మొన్నటివరకు ఏదైతే జరుగుతుందని భయపడ్డారో, అది ఇక లేదని తెలిసిన తర్వాత అభిమానులు పండగ చేసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రామ్ చరణ్ నటించకూడదని కోరుకున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు లేదని తేలడంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం రంగస్థలం సినిమా చేస్తున్న చెర్రీ, ఈ మూవీ తర్వాత కొరటాల దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. సో.. నెక్ట్స్ మూవీగా మణిరత్నం సినిమా లేదనే విషయం ఇక్కడే తెలిసిపోయింది. కానీ ఫ్యాన్స్ లో మాత్రం ఏదో మూల భయం ఉండనే ఉంది. దీనికి కారణం మణిరత్నం ఇంకో సినిమా ప్రకటించకపోవడమే.

ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరింది. శింబు హీరోగా మణిరత్నం సినిమా ఓకే అయింది. దీంతో ఓ వైపు శింబు ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుంటే.. మరోవైపు చెర్రీతో మణిరత్నం ప్రాజెక్టు లేదని మెగా ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.

నిజానికి మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మణిరత్నం అన్నీ ఫ్లాపులే ఇస్తున్నాడు. తాజాగా వచ్చిన చెలియా సినిమా అయితే డిజాస్టర్ అయింది. ఇలాంటి టైమ్ లో మణిరత్నంతో సినిమా చేయొద్దనేది ఫ్యాన్స్ డిమాండ్.