Home > Movies - Movie News
సైలెంట్ గా స్టార్ట్ అయిన పూరి సినిమా

తన పుట్టినరోజు సందర్భంగా కొడుకు ఆకాష్ తో చేయబోయే సినిమాను ప్రకటించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇప్పుడా సినిమాను సైలెంట్ గా స్టార్ట్ చేశాడు. హిమాచల్ ప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి మెహబూబా షూటింగ్ మొదలైంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా సినిమా లాంచ్ చేసి, రెగ్యులర్ షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నారు.

1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో ఈ సునిశితమైన ప్రేమకథ తెరకెక్కుతోంది. మంగుళూరుకు చెందిన నేహా షెట్టి.. మెహబూబాలో ఆకాష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. హీరోహీరోయిన్లపై తెరకెక్కిన ఫస్ట్ షాట్ కు ‘పూరి కనెక్ట్స్’ వ్యవహారాలు చూస్తున్న చార్మి క్లాప్ కొట్టింది.

కథ ప్రకారం.. ఇండో-పాక్ బోర్డర్స్ లోనే ఎక్కువగా ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు.  హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ తర్వాత పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో షూటింగ్ ఉంటుంది. సందీప్ చౌతా ఈ సినిమాకు సంగీత దర్శకుడు.