Advertisement


Home > Movies - Movie News
'మెర్సల్‌' రగడ: రాహుల్‌ తమిళ సెంటిమెంట్‌

విజయ్‌ హీరోగా తెరకెక్కిన 'మెర్సల్‌' సినిమా వివాదానికి సంబంధించి ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాందీ ఒకింత 'కామెడీ'తో కూడిన ట్వీటేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 'మెర్సల్‌' సినిమా వివాదంలో జోక్యం చేసుకుని, తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దంటూ రాహుల్‌ వేసిన ట్వీట్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయింశమయ్యింది. 

సినిమాకీ, తమిళ ఆత్మగౌరవానికీ లింకేమన్నా వుందా.? దటీజ్‌ రాహుల్‌గాంధీ. సినిమాలో కంటెంట్‌, భారతీయ జనతా పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా వుందన్నది నిర్వివాదాంశం. అందుకే, బీజేపీ నేతలు గుస్సా అవుతున్నారు. సినిమాలోని డైలాగ్స్‌ని మ్యూట్‌ చేసెయ్యాలనీ, అసలు సినిమానే బ్యాన్‌ చేసెయ్యాలనీ బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. జీఎస్‌టీ సహా పలు అంశాలపై సినిమాలో కడిగి పారేశారు మరి.! 

సినిమా వేరు, రాజకీయం వేరు కాదిక్కడ.. అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. ఓ సినీ నటుడిగా 'మెర్సల్‌' సినిమాకి కమల్‌ మద్దతివ్వడాన్ని తప్పు పట్టలేం. సినిమా కంటెంట్‌పై బీజేపీకి అభ్యంతరాలుండొచ్చుగాక. ఆ పార్టీ చేస్తున్న రాజకీయ ఆందోళనల్ని అంత సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, సందట్లో సడేమియా తమిళ ఆత్మగౌరవం పేరుతో రాహుల్‌గాంధీ ట్వీటేయడమేంటట.? ఎదగాలి రాహుల్‌.. ఇంకా రాజకీయంగా చాలా ఎదగాలి.. అనుకుంటున్నారిప్పుడు జనం అంతా. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ సారధ్య బాధ్యతల్ని పూర్తిస్థాయిలో చేపట్టనున్న రాహుల్‌లో ఇంత అపరిపక్వతతో కూడిన ఆలోచనలు ఎలా చేస్తున్నారట.!