Advertisement


Home > Movies - Movie News
మిస్టర్‌ సోమి: ఉతికారేసిన వర్మ.!

మర్యాద తిమ్మన్న సోమిరెడ్డిగారి కామెంట్స్‌.. అంటూ మొదలెట్టి, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఓ రేంజ్‌లో ఉతికి ఆరేసేశారు. వర్మ ఈ మధ్య ఇలాగే వ్యవహరిస్తున్నారు. తీసిన సినిమాలు తీసినట్టే అటకెక్కేస్తుండడంతో, దర్శకుడిగా ఎలాగూ లైమ్‌లైట్‌లో వుండలేకపోతున్నందున, సోషల్‌ మీడియాలో అయినా తన టాలెంట్‌ని చూపించి మార్కులు కొట్టేయాలనే ఆయనగారి తాపత్రయాన్ని అభినందించి తీరాల్సిందే.! 

మెగా ఫ్యామిలీని కొన్నాళ్ళు కెలికారు.. చీవాట్లు తినాల్సి వచ్చింది. దేవుళ్ళనీ కెలికేశారు.. కేసుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు రాజకీయాల మీద పడ్డారాయన. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా తెరకెక్కిప్తోన్న వర్మ, మంత్రి సోమిరెడ్డిపై సోషల్‌ మీడియా వేదికగా విరుచుకుపడిపోయారు. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' విషయమై సోమిరెడ్డి నిన్న నోరు పారేసుకోవడం తెల్సిన విషయమే. రాజకీయ నాయకులు చేసే పనే అది. కానీ, రాజకీయ నాయకులతో సమానంగా వర్మ కూడా తన 'టాలెంట్‌'ని ప్రదర్శించాలనుకుంటే ఎలా.? అందునా, ఫక్తు రాజకీయ నాయకుడిలా.. ఇంకా చెప్పాలంటే వైఎస్సార్సీపీ నేత తరహాలో సోమిరెడ్డికి వర్మ సమాధానమిచ్చేశారు. 

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేతో కలిసి వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా రూపొందిస్తోన్న విషయం విదితమే. అందుకేనేమో వర్మ, రియాక్షన్‌ ఇంత డిపరెంట్‌గా కన్పిస్తోంది. సోమిరెడ్డి మీడియాతో తన గురించి మాట్లాడిన ప్రతి మాటకీ వర్మ కౌంటర్‌ ఇవ్వడం చూస్తోంటే, వైఎస్సార్సీపీ నేతలు కూడా ఇంత డిటెయిల్డ్‌గా ఎప్పుడూ సోమిరెడ్డి విషయంలో స్పందించలేదేమో అన్పిస్తుంది. 

మొత్తమ్మీద, వర్మ తన పబ్లిసిటీ స్ట్రాటజీని పక్కాగా అమలు చేస్తున్నారన్నమాట. సినిమా ఎప్పుడొస్తుందో ఏమోగానీ, ఈలోగా వర్మకి బోల్డంత పబ్లిసిటీ. అసలు, వర్మం ఏం చేసినా పబ్లిసిటీ కోసమే కాబట్టి, ఈ తరహా పబ్లిసిటీ స్టంట్లు మామూలే. అయితే ఆ పబ్లిసిటీలోనూ ఎప్పటికప్పుడు వెరైటీ కోరుకోవడం వర్మ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే వర్మ కౌంటర్లకి బహుశా సోమిరెడ్డి నుంచి సౌండింగ్‌ వచ్చే అవకాశం దాదాపుగా వుండకపోవచ్చు.