Advertisement


Home > Movies - Movie News
ప్లీజ్.. ఇక చాలు.. ఆపు సప్తగిరి

సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా మారాడు కమెడియన్ సప్తగిరి. ఆ సినిమా ఏ రేంజ్ లో ఆడిందో అందరికీ తెలుసు. ఇక అక్కడితో తన హీరో ప్రస్థానాన్ని ఆపేస్తాడని అంతా అనుకున్నారు. కానీ సప్తగిరి ఎల్ ఎల్ బి అనే మరో సినిమా చేశాడు ఈ హాస్యనటుడు. 

ఓ వైపు కలెక్షన్లు కళ్లముందు కనిపిస్తుంటే మరోవైపు సప్తగిరి మాత్రం హీరోగా తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాడు. రాబోయే రోజుల్లో తనలోని హీరో యాంగిల్స్ మరిన్ని చూస్తారని చెబుతున్నాడు. నిజానికి విడుదలకు ముందే సప్తగిరికి ఈ హీరో వేషాలు అవసరమా అన్నారంతా. సునీల్ లా ఇబ్బందిపడతావని హెచ్చరించారు కూడా. కానీ ఈ కమెడియన్ కమ్ హీరో మాత్రం హీరోగా కూడా కొనసాగుతానని శపథం చేశాడు.

ఓ పేషెంట్ గా డా.రవికిరణ్ వద్ద చేరిన సప్తగిరి, మెల్లగా అతడ్ని ఇండస్ట్రీలోకి లాగి హీరో అవ్వాలనే తన కోరిక తీర్చుకున్నాడు. మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో పాటు కనీసం శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోలేదు. అందుకే మరో సినిమా తీసి రెండు సినిమాల శాటిలైట్స్ ఒకేసారి అమ్మేద్దేమని ఊరించాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా పోయింది. 

ఏపీలో 4కోట్ల 50లక్షల రూపాయలకు అమ్ముడుపోయిన సప్తగిరి ఎల్ ఎల్ బి సినిమా.. విడుదలైన మొదటి 4రోజుల్లో కేవలం కోటి 30లక్షలు మాత్రం సంపాదించగలిగింది. ఇక ఈ సినిమా కోలుకోవడం దాదాపు అసంభవం. తెలంగాణలో కూడా దీని పరిస్థితి ఇలానే ఉంది.