Advertisement


Home > Movies - Movie News
ఊర మాస్.. మరో మేకోవర్ లో నాని

మెడలో తాయెత్తు, ఎర్ర చొక్కా, లోపల నల్ల బనియన్, కింద లుంగీ, రఫ్ గడ్డం.. ఇలా పక్కా మాస్ లుక్ లోకి మారాడు నాని. తన అప్ కమింగ్ మూవీ కృష్ణార్జున యుద్ధంలో నాని గెటప్ ఇది. పండగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ లో యాక్షన్ లుక్ లో నాని స్టిల్ ను రిలీజ్ చేశారు. టైటిల్ ఎనౌన్స్ మెంట్ లో కూడా కాస్త స్పెషాలిటీ చూపించారు.

కృష్ణార్జున యుద్ధం టైటిల్ లో కేవలం కృష్ణ అనే పేరు మాత్రమే కనిపించేలా టైటిల్ రిలీజ్ చేశారు. అంటే మాస్ క్యారెక్టర్ పేరు కృష్ణ అన్నమాట. క్లాస్ లుక్ లో అర్జున్ పాత్ర ఫస్ట్ లుక్ ను రేపు విడుదల చేయబోతున్నారు. అంతేకాదు, మంగళవార ఫస్ట్ సింగిల్, లిరికల్ వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఒక క్యారెక్టర్ ఆంధ్రా బ్యాక్ డ్రాప్ లో ఉంటే, మరో క్యారెక్టర్ పారిస్ నేపథ్యంలో సాగుతుంది. మేర్లపాక గాంధీ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హిపాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ హీరోయిన్లు.