Advertisement


Home > Movies - Movie News
నాని.. నాని.. నాని.. ఎంసిఎ

నాని సినిమాలు అంటేనే టోటల్ గా అతని స్టయిల్ లోకి మారిపోతాయి. పైగా మామూలు సినిమాను కూడా నాని తన స్టయిల్ లోకి మార్చి, లాక్కుని వెళ్లిపోతాడు. నాని చేసి, హిట్ అయిన సినిమాల్లో మరో హీరోను ఊహించుకోలేము కూడా. అలాంటి డిఫరెంట్ స్టయిల్ హీరో నాని సినిమా మరోటి వస్తోంది. ఎంసిఎ. మిడిల్ క్లాస్ అబ్బాయి.

ఈ సినిమా 21న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రయిలర్ ఇప్పుడు లాంచ్ అయింది. ట్రయిలర్ మూడు వంతులు పక్కా నాని స్టయిల్ లో వుంది. వదిన-మరిదిల మద్య సరదా సన్నివేశాలతో, నాని టైపు ఫన్ తో ట్రయిలర్ సగం ఆకట్టకునేలా కట్ చేసారు. ఆ తరవాతి సగంలో అర్థభాగం సాయి పల్లవి ఎంటర్ అయింది.

ఆమె మార్కు హుషారు, ఫన్ ఫుల్ గా కనిపించాయి. దాంతో ఆ భాగం కూడా పాస్ అయిపోయింది. ఇక ట్రయిలర్ లో మిగిలిన పావు వంతు అసలు విషయం. అంటే వదినగారు గవర్నమెంట్ ఆఫీసర్, ఆమెకు ఎవరి నుంచో థ్రెట్. దాంతో వదినగారిని కాపడ్డానికి మరిది ఎంటర్ కావడం.

ఇది మాత్రం కాస్త రోటీన్ ఫార్ములా అనిపిస్తుందేమో? కానీ ట్రయిలర్ లో మూడు వంతులు నాని, సాయి పల్లవి లాక్కువెళ్లిపోయారు అంటే సినిమాలో కూడా అలాగే వుండే అవకాశం కనిపిస్తోంది. చిత్రమేమిటంటే ట్రయిలర్ లో ఒక్క సాంగ్ బిట్ కూడా లేకపోవడం, జస్ట్ సాయిపల్లవి, నానిల డ్యూయట్ బిట్ లు మాత్రం వున్నాయి కలర్ ఫుల్ గా. సాయి పల్లవిని చూస్తుంటే మళ్లీ జనాల్ని ఫిదా చేసేలాగే వుంది.