Home > Movies - Movie News
ఏం వసూళ్లూ.. నయనతార, లేడీ‌సూపర్ స్టారే

లేడీ సూపర్ స్టార్.. అనే బిరుదుకు న్యాయం చేస్తోంది నయనతార. అప్పుడెప్పుడో విజయశాంతి పేరుకు ముందు వాడిన ట్యాగ్ ను ఇటీవల నయనతారకు అతికించారు. వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ నయనతార దీన్ని సొంతం చేసుకుంది. ఈ పరంపరలో తాజాగా తమిళంలో ఆమె నటించిన ఒక సినిమా వచ్చింది. ఇందులో నయనతార కలెక్టర్ పాత్రను చేసింది.

వేరే మేల్ స్టార్ ప్రస్తావన ఏదీ లేని ఈ సినిమా తమిళనాట భారీ వసూళ్లను సాధిస్తుండటం గమనార్హం. గత శుక్రవారం విడుదల అయిన ఈ సినిమా చెన్నైలో భారీ వసూళ్లను సాధించిందని తమిళ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ సినిమా మూడు రోజుల్లోనే చెన్నైలో 1.2 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందట.

ఇది తమిళంలో వచ్చిన అన్ని లేడీ ఓరియెంటెండ్ సినిమాల్లో కెళ్లా టాప్ అని వారు విశ్లేషిస్తున్నారు. ఇన్నాళ్లలో నటీమణుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాల్లో ఏదీ ఈ స్థాయి వసూళ్లను సాధించలేదట. గతంలో ఇలాంటి సినిమాల్లో గరిష్టంగా సాధించిన వసూళ్లు ఎనభై లక్షల రూపాయలట.

అలాంటి రికార్డులను అధిగమనిస్తూ నయనతార సినిమా ఓపెనింగ్ వీకెండ్ లో చెన్నై సిటీలో 1.2 కోట్ల రూపాయలు వసూలు చేసిందని.. పాజిటివ్ టాక్ తో మిగతా చోట్ల కూడా భారీ వసూళ్లతో సాగుతోందని తమిళ ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు.