Home > Movies - Movie News
హాట్ సినిమాకు నో సెన్సార్ కట్

బోల్డ్ గా ఓ సినిమా తీస్తే భయపడాల్సిన పరిస్థితి ఉండేది మొన్నటివరకు. బాబూమోషాయ్ సినిమాతో పాటు చాలా బాలీవుడ్ మూవీస్ సెన్సార్ కత్తెర్లకు బలైపోయాయి. కానీ రిలీజ్ కు రెడీ అయిన జూలీ-2 మాత్రం గట్టెక్కేసింది. ఈ సినిమాకు ఒక్కటంటే ఒక్క కట్ పడలేదు. సినిమాలో హాట్ సీన్లు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. కానీ సెన్సార్ మాత్రం అవేవీ పట్టించుకోలేదు. ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఎ-సర్టిఫికేట్ ఇచ్చేశారు.

దీనికి కారణం ఒకటే. జూలీ-2కు ముందు వరకు పహలాజ్ నిహలానీ ఉన్నారు. జూలీ-2 నుంచి ఆయన లేరు. అంతే.. అదొక్కటే తేడా. సెన్సార్ రాజ్యాంగం ఏమీ మారలేదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి మాత్రమే మారాడు. మరీ ముఖ్యంగా జూలీ-2లో పహలాజ్ నిహలానీ హస్తం కూడా ఉంది. ఈ సినిమాకు ఆయనే సమర్పకుడు. ఆల్రెడీ బోర్డులో ఆయనకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. అలా జూలీ-2 సినిమా సేఫ్ గా సెన్సార్ నుంచి బయటపడింది.

ఈ మూవీతో బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది రాయ్ లక్ష్మీ. ఇన్నాళ్లు దాచుకున్న అందాలన్నింటినీ ఇందులో ఆరబోసింది. అక్టోబర్ 6 నుంచి థియేటర్లలో రాయ్ లక్ష్మీ అందాల విందు షురూ కానుంది. అది కూడా ఒక్క సెన్సార్ కట్ లేకుండా.