Advertisement


Home > Movies - Movie News
రాజమౌళిలో ఆ వేడి ఇప్పుడిప్పుడే పుడుతోంది!

రాజమౌళి నెక్ట్స్ సినిమా ఎవరితో..? 
అతడు ఎలాంటి కథను సెలక్ట్ చేసుకోబోతున్నాడు..?

ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో బ్రహ్మపదార్థంలా తయారైంది. అటు జక్కన్నతో పాటు ఇటు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. కానీ ఒక్క విషయంపై మాత్రం విజయేంద్ర ప్రసాద్ స్పష్టత ఇచ్చారు. ఇన్నాళ్లు రెస్ట్ తీసుకున్న రాజమౌళిలో ఇప్పుడిప్పుడే మరో సినిమా చేయాలనే వేడి పుడుతోందంటున్నారు.

"రాజమౌళి నెక్ట్స్ సినిమా విషయంలో గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. మరో సినిమా చేయాలనే వేడి ఇప్పుడిప్పుడే వాడిలో పుడుతోంది. బాహుబలి-2 సక్సెస్ ను సొమ్ము చేసుకోవాలనే రకం కాదు రాజమౌళి. పరుగెత్తి పాలు తాగాలనుకోడు."

తన నెక్ట్స్ సినిమా విషయంలో ప్రస్తుతానికి రాజమౌళికి గమ్యం లేదంటున్నారు విజయేంద్ర ప్రసాద్. మనసుకు నచ్చే వరకు కథలు వింటూనే ఉంటాడని తెలిపాడు.

"ఏ కథ దగ్గర వాడు (రాజమౌళి) ఆగుతాడో తెలీదు. జానర్ ఏదైనా, ఏ హీరోను దృష్టిలో పెట్టుకోకుండా ఎగ్జయిట్ అయ్యే కథ చెప్పమంటున్నాడు. కథ వినగానే కచ్చితంగా చేయాలని మనసుకు అనిపించాలంటున్నాడు. అలాంటి కథ అడుగుతున్నాడు. వాడిని మెప్పించడానికి శాయాశక్తులా ప్రయత్నిస్తున్నాను." 

అయితే ఒక విషయంపై మాత్రం క్లారిటీ ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి నెక్ట్స్ సినిమాలో హీరో ఎంపిక కథను బట్టే ఉంటుంది తప్ప, హీరోను దృష్టిలో పెట్టుకొని మాత్రం కథ, సినిమా ఉండదని మరోసారి స్పష్టంచేశారు.