Advertisement


Home > Movies - Movie News
ఎన్టీఆర్‌ కమిట్‌మెంట్‌కి హేట్సాఫ్‌

ద్విపాత్రాభినయం అంటే, సినిమాలో ఇంకో పాత్ర కోసం 'టెక్నిక్‌'ని ఎక్కువగా వాడేస్తుంటారు. ఫోకస్‌లో వుండే క్యారెక్టర్‌లో ప్రధాన పాత్రధారి కన్పిస్తే, ఫోకస్‌లో లేని పాత్రకి డూప్‌ని వాడుతుండటం మామూలే. అలా ఫోకస్‌లో లేని పాత్రల కోసం ముందుగా డూప్‌, అతనికి మళ్ళీ మాస్క్‌లు వినియోగించాలని అనుకున్నా, ఆ తర్వాత ఆ ఆలోచనని పక్కన పెట్టేశామంటున్నాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. 'జై లవ కుశ' సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్‌, ఎక్కడా డూప్‌ జోలికి వెళ్ళలేదనీ, మూడు పాత్రల్లోనూ తానే కన్పించాననీ, సహజత్వానికి ఏమాత్రం దూరంగా వుండకూడదన్న ఉద్దేశ్యంతోనే అలా చేయాల్సి వచ్చిందన్నాడు. 

వాస్తవానికి 'జై లవ కుశ' సినిమా కోసం విదేశీ సాంకేతిక నిపుణుడ్ని తీసుకొచ్చారు. ఎన్టీఆర్‌ కోసం మాస్క్‌ల్ని కూడా తయారు చేయించారు. అప్పట్లో ఆ మాస్క్‌లకి సంబంధించిన ఫొటోలూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అయితే, షూటింగ్‌ స్టార్ట్‌ చేశాక, దర్శకుడు బాబీతో, ఎన్టీఆర్‌ 'డూప్‌' అవసరం లేదని చెప్పాడట. 'కొంచెం కష్టమవుతుంది..' అని బాబీ చెప్పినా, కాన్ఫిడెంట్‌గా ఎన్టీఆర్‌ చేసేద్దామని భరోసా ఇచ్చాడట. 

అలా, డూప్‌గానీ ఫేస్‌ మాస్క్‌గానీ లేకుండానే చాలా జాగ్రత్తగా ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేసేశానంటున్నాడు ఎన్టీఆర్‌. సినిమా ప్రమోషన్‌ కోసం మీడియా ముందుకొస్తున్న ఎన్టీఆర్‌ మాటల్లో, 'జై' పాత్ర గురించీ, సినిమాలో త్రిపాత్రాభినయం గురించీ చెబుతున్నమాటలు అతనిలోని పరిపూర్ణమైన నటుడ్ని ఎలివేట్‌ చేస్తున్నాయి. అంతే కాదు, సినిమా పట్ల ఎన్టీఆర్‌ కమిట్‌మెంట్‌ కన్పిస్తోంది. డెడికేషన్‌ అంటే ఇదీ అనే స్థాయిలో ఎన్టీఆర్‌ వ్యవహార శైలి కన్పిస్తోంది. 

మరి, ఆ కమిట్‌మెంట్‌, డెడికేషన్‌ సినిమాలో ఏ మేరకు వర్కవుట్‌ అయ్యాయో తెలియాలంటే, సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.