Advertisement


Home > Movies - Movie News
రాశి విషయంలో రిస్క్ వద్దన్న ఎన్టీఆర్

జై లవకుశలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. లవ క్యారెక్టర్ సరసన రాశి ఖన్నా నటించింది. అతడితో కలిసి చక్కగా డాన్స్ చేసింది. ఎన్టీఆర్ కూడా రాశి యాక్టింగ్, డాన్సింగ్ చాలా బాగా చేసిందని మెచ్చుకున్నాడు. అయితే ఇంత మెచ్చుకున్న తారక్, ఒక విషయంలో మాత్రం రాశిని పక్కనపెట్టాడు. 

జై లవకుశ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుందట రాశిఖన్నా. ఇదే విషయాన్ని దర్శకుడు బాబితో కూడా చర్చించింది. విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది. అయితే తారక్ మాత్రం నో చెప్పేశాడు. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రాశి ఖన్నాకు నో చెప్పి, ఆమెకు రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టుతోనే పనికానిచ్చేశాడు. 

రాశి ఖన్నా తెలుగు నేర్చుకుంది. బాగానే మాట్లాడుతోంది. కానీ డబ్బింగ్ చెప్పేంత టాలెంట్ ఆమెకు ఉందా లేదా అని చెక్ చేసేంత టైమ్ జై లవకుశ యూనిట్ కు లేదు. అందుకే వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. ఇదే విషయాన్ని రాశి వద్ద ప్రస్తావిస్తే, కనీసం తన నెక్ట్స్ సినిమాకైనా డబ్బింగ్ చెప్పుకుంటానంటోంది.