Advertisement


Home > Movies - Movie News
ఓన్లీ సంక్రాంతి... నో మోర్...

రీఎంట్రీ ఇచ్చాడు, రేసుగుర్రంలా దూసుకుపోతాడు అనుకుంటున్నారేమో.. అలాంటిదేం లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ మార్చారు. ఇటు సినీకెరీర్, అటు పొలిటికల్ కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు చిరు. ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఒక్క సినిమా కూడా సంక్రాంతికే విడుదలయ్యేలా ప్లాన్ చేసుకున్నారు కూడా. 

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. సుదీర్ఘ విరామం తర్వాత తెరపైకొచ్చిన ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ మూవీ తర్వాత తన 151వ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసేందుకు సిద్ధమౌతున్నారు చిరు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్. 

ఇలా ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయాలని అనుకుంటున్నారట చిరు. మరో రెండేళ్లలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అప్పటికి పొలిటికల్ గా తన బేస్ ను మరింత పెంచుకోవాలనుకుంటున్నారు చిరంజీవి. మసకబారిన రాజకీయ ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే ఇప్పట్నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. అలాఅని మరోసారి సినిమాల్ని పక్కనపెట్టే పరిస్థితి లేదు. అందుకే ఇటు సినిమాలు, అటు పొలిటికల్ కెరీర్ ను బ్యాలెన్స్ చేయాలంటే ఏడాదికి ఒక సినిమా చేయడమే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారట చిరు.