Advertisement


Home > Movies - Movie News
పైశాచికానందానికి 'సోషల్‌' కలర్‌.!

క్రియేటివిటీకి హద్దులు చెరిగిపోతున్నాయ్‌. సినీ రంగంలో వింత పోకడలు పుట్టుకొస్తున్నాయి. హీరోయిన్‌ అర్థనగ్నంగా కన్పించడం తప్పనిపించడంలేదు.. లిప్‌ టు లిప్‌ కిస్‌లు సర్వసాధారణమైపోయాయి. స్వలింగ సంపర్కానికి సంబంధించిన అంశాలూ పరమ రొటీన్‌గా మారిపోయాయి. ఇవన్నీ చాలక, అక్రమ సంబంధాల్లో కొత్త కొత్త కోణాల్ని వెలికి తీస్తుండడమూ చూస్తున్నాం. 

అన్నా, చెల్లెళ్ళ మధ్య 'ఇంటిమేట్‌ స్టోరీ' గురించి ఆలోచన చేయగలమా.? ఆ ఆలోచన చేసేశారు బాలీవుడ్‌లో. 'ఐ యామ్‌ రోషిణి' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. సినిమా ట్రైలరొచ్చింది. తల్లిదండ్రులు, పిల్లల్ని పట్టించుకోకపోతే, వారి పట్ల 'రూడ్‌'గా ప్రవర్తి పరిస్థితులు ఎలా వుంటాయో చెప్పే గొప్ప చిత్రమట ఇది. తల్లిదండ్రులు అలా వ్యవహరిస్తే, అన్నా చెల్లెళ్ళ మధ్య 'ఏదో సంబంధం' ఏర్పడుతుందన్నది చిత్ర దర్శక నిర్మాతల 'ఉవాచ'. 

'ఐ యామ్‌ రోషిణి' సినిమా కథ ఇదే. పైగా, సమాజానికి ఓ మంచి మెసేజ్‌ ఇచ్చేస్తున్నామనీ, సున్నితమైన అంశం కావడంతో ఎంతో జాగ్రత్తగా సినిమా డీల్‌ చేశామనీ నిర్మాత సురేష్‌ థామస్‌ అంటున్నాడు. అయితే, 'ఇంటిమేట్‌ స్టోరీ ఆఫ్‌ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌' అనడంలోనే 'సభ్య సమాజానికి అసభ్య మెసేజ్‌' ఇస్తున్నామన్న విషయాన్ని ట్రైలర్‌ ద్వారా చెప్పకనే చెప్పేశారు. 

ఈ తరహా క్రియేటివిటీ అనే పైశాచికత్వానికి ఆకాశమే హద్దు అనుకోవాలేమో. ఎందుకంటే, సెన్సార్‌ బోర్డ్‌ కళ్ళు మూసుకుంటోంది గనుక.!