Home > Movies - Movie News
పవన్ మొహమాటపడ్డాడు... త్రివిక్రమ్ చెప్పేశాడు...

పవన్ మనసంతా ఇప్పుడు రాజకీయాలపైనే ఉంది. సినిమాలైతే చకచకా చేస్తున్నాడు కానీ ఎప్పుడు ఫుల్ లెంగ్త్ పాలిటిక్స్ లోకి దూకేద్దామా అనే తాపత్రయం పవన్ కల్యాణ్ లో కనిపిస్తోంది. కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. పవన్ కు ఏం కావాలో అన్నీ దగ్గరుండి సమకూరుస్తున్న త్రివిక్రమ్... కాటమరాయుడు ప్రీరిలీజ్ ఫంక్షన్ కోసం కూడా వర్క్ చేశాడు. పవన్ ఏం మాట్లాడితే బాగుంటుందో ఎలా మాట్లాడితే బాగుంటుందో ముందే ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. 

ఇక రాజకీయ అంశాల విషయానికొస్తే... తనకు ఏ బాధ్యత అప్పగించినా నిజాయితీగా పనిచేస్తానంటూ పవన్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. "నాకు ఏ పని ఇచ్చినా, అది తోట పని అయినా, వీధులు తుడిచే పని అయినా నిజాయితీగా చేస్తాను. నిస్సిగ్గుగా చేస్తా. భవిష్యత్ లో ఎలాంటి బాధ్యత అప్పగించినా అంతే నిజాయితీగా వర్క్ చేస్తా. అధికారం అంతిమ లక్ష్యం కాదు. మీ అందరు క్షేమంగా వుండాలి అదే నా కోరిక". ఇలా సాగింది పవన్ ప్రసంగం. తను చెప్పాల్సింది పరోక్షంగా చెప్పేశారు.

అయితే త్రివిక్రమ్ మాత్రం సూటిగా సుత్తిలేకుండా చెప్పేశాడు. పవన్ కేవలం ఓ వ్యక్తి మాత్రమే కాదని, అతడి వెనక కోట్లాది మంది అభిమానుల శక్తి ఉంది. అతడి సేవా కార్యక్రమాలు మరిన్ని రంగాలకు విస్తరించాలని అన్నారు. మరింత ఎక్కువ మందికి పవన్ సేవ చేయాలని త్రివిక్రమ్ ఓపెన్ గానే రాజకీయాల గురించి మాట్లాడారు. ఓవరాల్ గా చెప్పాలంటే పాలిటిక్స్ అనే పదం మాత్రం వాడకుండా మొత్తం రాజకీయాల గురించే అంతా మాట్లాడారు.