Home > Movies - Movie News
పిక్‌ టాక్‌: ఐష్‌.. రెడ్‌ హాట్‌ లిప్స్‌

కేన్స్‌ చిత్రోత్సవమనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఐశ్వర్యారాయ్‌ గ్లామరే. ఆ స్థాయిలో కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్‌ హొయలొలికించేస్తూ వస్తోంది. తన కుమార్తె ఆరాధ్యతో కలిసి కేన్స్‌ చిత్రోత్సవానికి వెళ్ళిన ఐష్‌, ఇదిగో ఇలా రెడ్‌ హాట్‌ లిప్స్‌తో హల్‌చల్‌ చేస్తోంది. బీచ్‌ ఒడ్డున ఐశ్వర్య ఫొటోలకు పోజులిచ్చేస్తూ సందడి చేసింది. 

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. వయసు మీద పడ్తున్నా వన్నె తగ్గని అందం ఐశ్వర్యారాయ్‌ది. అందాల పోటీలు, మోడలింగ్‌, సినీ రంగం.. ఒకటేమిటి, ఎక్కడన్నా ఐశ్వర్యారాయ్‌ది టాప్‌ పొజిషనే. పెళ్ళయ్యాకా సినిమాల్లో కొనసాగిన ఐశ్వర్యారాయ్‌, కుమార్తె ఆరాధ్య జన్మించాక కాస్త బ్రేక్‌ తీసుకుని, మళ్ళీ సినిమాల్లో కొనసాగుతోంది. 

ఇదివరకటిలా వరుస సినిమాలు చేసెయ్యకపోయినా, అప్పుడప్పుడూ వెండితెరపై తళుక్కున మెరుస్తూనే వుంది ఐశ్వర్యారాయ్‌. అప్పుడప్పుడూ మాత్రమే కన్పిస్తున్నా, ఇదివరకటిలా సక్సెస్‌లు లేకపోయినా, ఐశ్వర్యారాయ్‌కి వున్న డిమాండ్‌ ఏమాత్రం తగ్గలేదు. నేటితరం అందాల భామలు కేన్స్‌ చిత్రోత్సవంలో సందడి చేస్తోంటే, వాళ్ళకు ధీటుగా ఐశ్వర్య తన గ్లామర్‌ని ఒలకబోసేస్తుండడం విశేషమే మరి. దటీజ్‌ ఐశ్వర్యారాయ్‌.