Home > Movies - Movie News
పిక్‌ టాక్‌: ఐష్‌ విత్‌ జూనియర్‌ ఐష్‌

ఏమో, భవిష్యత్తులో అమ్మని మించిన 'అందగత్తె' అవడంతోపాటుగా, అమ్మని మించిన గొప్ప నటి అవుతుందేమో ఆరాధ్య.! ఐశ్వర్యారాయ్‌ గారాల పట్టి ఆరాధ్య, ఇప్పుడు కేన్స్‌ చిత్స్రోతవం సందర్భంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది. అమ్మతో కలిసి కేన్స్‌ చిత్రోత్సవానికి బయల్దేరింది ఆరాధ్య. అంతేనా, అమ్మతో కలిసి ఫొటోలకు పోజులివ్వడం కూడా షురూ చేసేసింది. 

మామూలుగా అయితే, తమ పిల్లలతో ఇలాంటి ఉత్సవాలకు అటెండ్‌ అయ్యేందుకు అందాల భామలు అంతగా ఆసక్తి చూపరు. కారణం, తమ వయసు బయటపడిపోతుందనే. ఐశ్వర్యారాయ్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నం. కుమార్తెతో కలిసి ఇలా ఆయా వేదికల్ని పంచుకోవడం ఆమె ప్రత్యేకత అనే చెప్పుకోవాలి. 

ఫొటోలో చూస్తే, కేన్స్‌ కోసమే రెట్టించిన అందం సొంతం చేసుకుందేమో అనేంత అందంగా దర్శనమిస్తోంది ఐశ్వర్యారాయ్‌. కేన్స్‌ చిత్రోత్సవమంటే అందాల భామల అందాల విందుకు కేరాఫ్‌ అడ్రస్‌. గత కేన్స్‌ చిత్రోత్సవాల్లో ఐశ్వర్యారాయ్‌ గ్లామర్‌ ఒలకబోసిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి, ఈసారి ఐష్‌ ఏ స్థాయిలో కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై అందాల విందు చేస్తుందో మరి.! అమ్మ ఐశ్వర్యారాయ్‌ సంగతి సరే.. కూతురు జూనియర్‌ ఐష్‌.. అదేనండీ ఆరాధ్య సంగతేంటట.!