Home > Movies - Movie News
పిక్‌ టాక్‌: బికినీలో రచ్చ రచ్చ

బాలీవుడ్‌ భామ లిసా హేడెన్‌ గర్భవతి. ఇదిగో, ఇలా బీచ్‌లో బికినీతో తాను ప్రెగ్నెంట్‌నన్న విషయాన్ని ఆమె ఖరారు చేసింది. డినో లల్వానితో కొన్నాళ్ళ ప్రేమాయణం అనంతరం మొన్నీమధ్యనే అతనితో పెళ్ళాడిన లిసా హేడెన్‌.. ఇప్పుడు ఇదిగో, ఇలా తన ప్రెగ్నెన్సీతో వార్తల్లోకెక్కింది. పెళ్ళయ్యాక తిరిగి సినిమాల్లో నటిస్తానని ఇదివరకే ప్రకటించింది. 

అన్నట్టు, లిసా హెడెన్‌ తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా నటించిన 'రచ్చ' సినిమాలో ఐటమ్‌ సాంగ్‌లో కన్పించిందండోయ్‌. ఈ మధ్యనే హృతిక్‌ రోషణ్‌తో హాట్‌ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చి వార్తల్లోకెక్కింది. అంతలోనే, ఇదిగో ఇలా ప్రెగ్నెంట్‌ లుక్‌లో బికినీతో పోజులిచ్చి అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. లిసా హెడెన్‌ బికినీ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయింది.