Advertisement


Home > Movies - Movie News
పిక్‌ టాక్‌: బికినీలో రత్తాలు కెవ్వుకేక

'రత్తాలూ రత్తాలూ..' అంటూ 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి స్టెప్పులు ఓ రేంజ్‌లో ఇరగదీసేసింది లక్ష్మీ రాయ్‌ అలియాస్‌ రాయ్‌ లక్ష్మీ.! ప్రస్తుతం బాలీవుడ్‌లో 'జూలీ-2' సినిమాలో నటిస్తోన్న రాయ్‌ లక్ష్మీ, ఆ సినిమాకి సంబంధించి ఓ స్టిల్‌ని సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. సోషల్‌ మీడియాలో ఇలా పోస్ట్‌ చేసిందో లేదో, అలా క్షణాల్లో ఈ ఫొటో వైరల్‌ అయిపోయింది. 

అవదా మరి, ఆ రేంజ్‌లో వుంది ఫొటో. అంతా బాగానే వుందిగానీ, ఈ బికినీ ఫొటో ఒరిజినలేనా.? ఈ డౌట్‌ ఎందుకొస్తోందంటే, కాస్త బొద్దుగా వుండే రాయ్‌ లక్ష్మీ.. బికినీలో మహా నాజూగ్గా తయారయ్యింది మరి. అన్నట్టు, అంత నాజూగ్గా అవడానికి చాలా కష్టపడిందట ఈ అందాల భామ. కాబట్టి, ఇది మార్ఫింగ్ కాదు.. నిజ్జంగా నిజమైన ఫొటోనే. ఇదిలా వుంటే, చాలాకాలం క్రిందట నేహా ధూపియా ప్రధాన పాత్రలో 'జూలీ' సినిమా వచ్చింది. దానికి సీక్వెల్‌ ఇప్పుడు రాయ్‌ లక్ష్మీతో తెరకెక్కుతోంది. 

'జూలీ'లో నేహా ధూపియా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. అప్పట్లో ఆ సినిమాలో ఆమె గ్లామర్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇప్పుడేమో, అంతకు మించి తన బికినీ గ్లామర్‌తో హీటెక్కించేస్తానంటోంది 'జూలీ-2'లో నటిస్తోన్న రాయ్‌ లక్ష్మీ. సినిమా సంగతేమోగానీ, ఈ బికినీ ఫొటో అయితే మాత్రం కెవ్వు కేక.. అనే రేంజ్‌లోనే వుంది. ఒకటి కాదు, చాలానే వున్నాయట ఇలాంటివి. అందులో ఫస్ట్‌ ఫొటో అట ఇది.