Advertisement


Home > Movies - Movie News
పిక్‌ టాక్‌: మామ బాటలో కాబోయే అల్లుడు.?

ఫొటోలో వున్నది కమల్‌హాసన్‌, ఆయన కుమార్తె శృతిహాసన్‌. ఇంకో వ్యక్తి కూడా వున్నాడండోయ్‌. అతనెవరో కాదు, శృతిహాసన్‌కి స్నేహితుడట. అదేనండీ బాయ్‌ ఫ్రెండ్‌. విదేశాల నుంచి వచ్చాడు. కమల్‌, శృతితో కలిసి ఓ వివాహ వేడుకకి హాజరయ్యాడు శృతిహాసన్‌ స్నేహితుడు మైఖేల్‌ కార్సోల్‌. తమిళనటుడు అధవ పెళ్ళి వేడుకలో ఈ దృశ్యం ఆవిష్కకృతమయ్యింది. 

విదేశాల్లో శృతి, మైఖేల్‌ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న వైనం ఇప్పటికే అందరికీ తెలుసు. 'మేమిద్దరం మంచి స్నేహితులం' అని మాత్రమే ఇప్పటిదాకా చెబుతూ వస్తోంది శృతిహాసన్‌. ఇప్పటికీ అదే మాట. మొన్నీమధ్యనే తన తల్లి సారికకి, మైఖేల్‌ని పరిచయం చేసిన శృతిహాసన్‌, తాజాగా తన తండ్రి కమల్‌హాసన్‌కి కూడా మఖేల్‌ని పరిచయం చేసింది. 

మైఖేల్‌, కమల్‌ నిన్నటి పెళ్ళి వేడుకలో కాస్త 'ప్రైవేట్‌'గా చర్చించుకున్నారట కూడా. ఈ విషయం ఇప్పుడు తమిళనాట వైరల్‌గా మారింది. ఆల్రెడీ శృతి, మైఖేల్‌ పెళ్ళి చేసేసుకున్నారనే గాసిప్స్‌ చక్కర్లు కొడ్తున్నాయి. పెళ్ళి కాదు, ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే వాదనలూ తెరపైకొస్తున్నాయి. ఏదైతేనేం, మామ కమల్‌హాసన్‌, కాబోయే అల్లుడు మైఖేల్‌ కార్సోలె ఇద్దరూ ఒకే తరహా డ్రెస్సింగ్‌తో నటుడు అధవ పెళ్ళి వేడుకలో సందడిచేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

పెళ్ళయిపోయిందట.. సహజీవనం చేస్తున్నారట.. అంటూ పలు ప్రశ్నలు శృతిహాసన్‌ ముందుకొచ్చినా, ఆమె అవుననిగానీ, కాదనిగానీ చెప్పకపోవడం గమనార్హం. 'నో కామెంట్‌' అనేసి ఊరుకుందట శృతిహాసన్‌, మైఖేల్‌ కార్సొలే విషయంలో. అత్యంత సన్నిహితులుకు సైతం శృతి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.