Home > Movies - Movie News
పిక్‌ టాక్‌: తాప్సీ బికినీ 'సలహా'.!

'కెరటానికి ఎదురెళ్ళాలనుకుంటే, ధృఢంగా నిలబడాలి.. ఆ క్షణాల్లో పెదాలపై చిరునవ్వు మాత్రం మర్చిపోవద్దు..' ఇదీ పై ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ, అందాల భామ తాప్సీ ఇచ్చిన సలహా. 

'తెలిసీ తెలియక గ్లామరస్‌ షో చేసేశాను.. ఇకపై అలాంటి అందాల ప్రదర్శన చేయబోను..' అంటూ ఆ మధ్య పలు ఇంటర్వ్యూల్లో గ్లామర్‌కి వ్యతిరేకంగా ఎడా పెడా కామెంట్లు చేసేసిన తాప్సీ, 'జుద్వా-2' సినిమా కోసం మాత్రం, గ్లామర్‌ హద్దులు చెరిపేసింది.

ఇదిగో, ఇలా బికినీల్లో చెలరేగిపోయింది. 'అందాల ప్రపంచంలో అందంగా కన్పించకపోతే ఎలా.?' అంటూ కొత్త క్లాసులు తీసుకుంటోందిప్పుడు తాప్సీ. పైగా, బీచ్‌లో బికినీతో కాక, చీర కట్టుకుని స్విమ్‌ చేయగలమా.? అని ప్రశ్నించడం తాప్సీకే చెల్లిందండోయ్‌.! 

బికినీ గ్లామర్‌ ఒలకబోసేస్తేనేం, మంచి 'కోట్‌' అయితే చెప్పింది తాప్సీ. ఈ సలహా పాటించి తీరాల్సిందే. కష్టాల్లో వున్నప్పుడు, ధైర్యంగా నిలబడటమే కాదు, పెదాలపై చిరునవ్వుని చెరగనివ్వకూడదు. చిరునవ్వే ఆత్మవిశ్వాసానికి ప్రతీక.. అదే అసలైన ఆయుధం.! హాట్‌ బ్యూటీ చెప్పిన ఈ సలహా పాటించేదెవరోగానీ, తాప్సీకి అప్పుడే ట్రాలింగ్‌ షురూ అయిపోయింది.. ఆ మధ్య ఎక్స్‌పోజింగ్‌ చెయ్యనన్నావ్‌, ఇదేంటి.? అంటూ ట్రాలింగ్‌ జరుగుతోంటే.. తాప్సీ అభిమానులూ వాటికి కౌంటర్‌ గట్టిగానే ఇచ్చేస్తున్నారు.