Home > Movies - Movie News
ప్రీ ఎలక్షన్ ఫంక్షన్

ఎవరన్నారు? పవన్ కు స్ట్రాటజీ లేదని? చిరంజీవి కాదు, ముక్కు సూటిగా వెళ్లి బొక్క బోర్లా పడడానికి. ఇది పవన్ కళ్యాణ్. ఇతగాడి స్ట్రాటజీలే వేరు. పార్టీ పేరు తప్ప వేరేదీ లేదు, ఎవరైనా సినిమా ఫంక్షన్ లకు సినిమా వాళ్లని, పొలిటికల్ వాళ్లని ముఖ్య అతిధులుగా రాజకీయ నాయకులను, లేకుంటే సినిమా వాళ్లను ముఖ్య అతిధులుగా పిలుస్తారు. కానీ పవన్ సభకు మీడియా పెద్దలు టీవీ9 రవిప్రకాష్, ఎన్టీవీ చౌదరి వచ్చారు. వీళ్లు గతంలో కూడా పవన్ సభలకు వచ్చారు. సభలో ఆద్యంతం పొలిటికల్ వాసనలున్న మాటలు వినిపించాయి. ఇవన్నీ వింటుంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ నా, ప్రీ ఎలక్షన్ ఫంక్షన్ నా అనిపించింది.

ఈసారి టీవీ9 రవిప్రకాష్ కాస్త గట్టి ప్రసంగమే చేసారు. ఎన్నికైన వారు వాగ్దానాలు మరిచి, కుటుంబక్షేమం చూసుకుంటున్నారని రవిప్రకాష్ కామెంట్ చేసారు. మరి ఇప్పుడు పాలనలో వున్నది, ఈ మాట తగిలేది నేరుగా చంద్రబాబుకే. మరి రవిప్రకాష్ ఇలా ఎందుకు అన్నారో ఆయనకే తెలియాలి.

త్రివిక్రమ్

ఒకడెవడో వస్తాడు..న్యాయం చేస్తాడు అని జనం నాకేసి చూస్తుంటే నాకేమీ ఆనందంగా వుండదు. జనం ఇంకా అలాంటి పరిస్థితుల్లో బాధగా వుంటుంది అంటాడు పవన్ కళ్యాణ్.

చేయి ఎత్తితే లక్షలాది మంది ఆగిపోయేంత శక్తి అందరికీ వుండదు, కోట్లలో ఒకరికే వుంటుంది. అలా వెళ్లమని చెబితే చాలు, ఎందుకు ఏముంది అని అడగకుండా జనం వెళ్లిపోయేంత అభిమానం అందరికీ వుండదు. కోట్లలో ఒకరికే వుంటుంది. ఇలాంటి వ్యక్తి తన శక్తిని మరిన్ని సేవలకు విస్తరించాలని కోరుకుంటున్నాను.

పవన్

యువ మహిళాసోదరిలకు నమస్కారం. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. టెక్నీషియన్ కావాలనుకున్నాను. ఏక్టర్ అవుతా అనుకోలేదు. జరిగిపోయింది అలా. నాకు ఏ పని ఇచ్చినా, అది తోట పని అయినా, వీధులు తుడిచే పని అయినా నిజాయితీగా చేస్తాను. నిస్సిగ్గుగా చేస్తాను. భవిష్యత్ లో ఎలాంటి బాధ్యతలో పెట్టినా కానీ అంతే నిజాయతీగా పనిచేస్తాను. అధికారం అంతిమ లక్ష్యం కాదు. జరిగిందా మంచిదే, జరగలేదా మంచిదే. మీ అందరు క్షేమం గా వుండాలి అదే కోరిక.

నేనింత గొప్పోడుని, నువ్వు అలా పడి వుండమంటే పడి వుండను. నీకు అధికారం వుండొచ్చు, డబ్బు వుండొచ్చు. కానీ నాలాంటి వాడివే అన్నది నా అభిమతం. నేను ఈ సృష్టికి, జీవం వున్న వారికి, లేని వాటికి, అన్నింటికీ సదా శిరసు వంచి మోకరిల్లుతాను.

మరి ఇలాంటి స్పీచ్ లు అడియో ఫంక్షన్ లో వున్నాయి అంటే అది ప్రీ రిలీజ్ ఫంక్షన్, ప్రీ ఎన్నికల ఫంక్షన్ నా అనిపించింది కాటమరాయుడు సభ.