Advertisement


Home > Movies - Movie News
రజనీకాంత్‌ కోసం అమీర్‌ఖాన్‌ త్యాగం.!

రజనీకాంత్‌ మీద అమీర్‌ఖాన్‌కి ఎంత అభిమానమో.! ఆ అభిమానంతోనే, 'రోబో' సీక్వెల్‌ '2.0' సినిమాలో నటించబోనని చెప్పాడట అమీర్‌ఖాన్‌. దర్శకుడు శంకర్‌ తనకు '2.0' కథ విన్పించాడనీ, స్వయంగా రజనీకాంత్‌ '2.0' సినిమా తనను చేయాల్సిందిగా అడిగారనీ, అయినా తాను చేయబోనని తేల్చి చెప్పేశాననీ అమీర్‌ఖాన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కారణమేంటో తెలుసా.? ఆ కథ విన్నాక, రాత్రిళ్ళు నిద్రలో కూడా రజనీకాంతే ఆ పాత్రలో కన్పించాడట. స్టోరీ అదిరింది కదూ.! 

బాలీవుడ్‌ హీరోలు, రజనీకాంత్‌ని ఈ స్థాయిలో మోసేయడం ఇది కొత్త కాదు. షారుక్‌ఖాన్‌, ఏకంగా తన సినిమా 'చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌' కోసం రజనీకాంత్‌ని ఏ స్థాయిలో వాడేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అమీర్‌ఖాన్‌, ఆ బాటలో నడుస్తున్నాడనుకోవాలేమో.! 

ఒక్కటి మాత్రం నిజం. అమీర్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌ బాలీవుడ్‌లో సూపర్‌ స్టార్స్‌. రజనీకాంత్‌కి భాషతో సంబంధం లేదు. తమిళ సూపర్‌ స్టార్‌ అయినా, తెలుగులోనూ, బాలీవుడ్‌లోనూ, కన్నడంలోనూ, ఇతర చాలా భాషల్లోనూ విపరీతమైన పాపులారిటీ వుంది రజనీకాంత్‌కి. అద్గదీ అసలు విషయం. '2.0' సినిమాలో రజనీకాంత్‌ నటించాడు. ఆ సినిమా ఏమవుతుంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఓపెనింగ్స్‌ పరంగా దేశంలోనే సరికొత్త సంచలనాన్ని సృష్టించబోతోందన్నది నిర్వివాదాంశం. 

తమిళ, హిందీ, తెలుగు, మలయాళ భాషలే కాదు, ప్రపంచ దేశాల్లోని వివిధ భాషల్లోనూ రజనీకాంత్‌ సినిమా విడుదలవుతుంది. అదీ రజనీకాంత్‌ ప్రత్యేకత. సో, ఓపెనింగ్స్‌ పరంగా అయితే అమీర్‌ఖాన్‌ చేసేదానికన్నా ఎక్కువే రజనీకాంత్‌ సినిమా చేస్తుందన్నమాట. కానీ, రజనీకాంత్‌ వయసు.. ఫిట్‌నెస్‌.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం, అమీర్‌ఖాన్‌ బెస్ట్‌ ఛాయిస్‌ అనొచ్చేమో.!