Advertisement


Home > Movies - Movie News
వాయిదాపడిన రకుల్ హిందీ సినిమా

బాలీవుడ్ లో క్లిక్ అయిపోదామని ఎన్నో కలలు కనింది. కెరీర్ లోనే ఫస్ట్ టైం చాలా ఎగ్రెసివ్ గా ప్రచారం కూడా చేసింది. ఏవేవో ఆఫర్లు పెట్టి, తనతో ఒక రోజంతా గడిపే పోటీ కూడా నిర్వహించింది. ఇలా తన హిందీ సినిమా కోసం ఎన్నో చేసిన రకుల్ కు నిరాశ ఎదురైంది. ఈ నెలాఖరుకు విడుదలవుతుందనుకున్న అయ్యారీ సినిమా అనుకోని విధంగా వాయిదాపడింది.

సిద్దార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 26న విడుదలకు సిద్ధం చేశారు. దాదాపు 2వారాలుగా ప్రమోషన్ కూడా చేస్తున్నారు. అక్షయ్ నటించిన ప్యాడ్ మాన్ బరిలో ఉన్నప్పటికీ ఒక్క సినిమానే కదా అని ధీమాగా ఉన్నారు. కానీ సడెన్ గా సీన్ లోకి పద్మావతి ఎంటరైంది.

సెన్సార్ అడ్డంకులు పూర్తిచేసుకొని, జనవరి 25న థియేటర్లలోకి రాబోతోంది ఈ సినిమా. ప్యాడ్ మాన్ తో పాటు పద్మావతి కూడా పోటీలో నిలవడంతో అయ్యారీ సినిమా ఇరకాటంలో పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మూవీని 2వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరి 9న రకుల్ సినిమా థియేటర్లలోకి వస్తుంది.