Home > Movies - Movie News
రకుల్ ప్రీత్ కొత్త లవ్ ఇదే

మరో 2రోజుల్లో స్పైడర్ సినిమా విడుదలకు సిద్ధమౌతుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అప్పుడే సెలబ్రేషన్స్ ప్రారంభించింది. తాజాగా దక్కిన రెమ్యూనరేషన్ తో బెంజ్ ఎస్ యూవీ మోడల్ కు చెందిన ఓ కాస్ట్ లీ కారు కొనుక్కుంది రకుల్. తన కొత్త కారు ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. “ఇదే నా కొత్త లవ్” అంటూ ట్వీట్ చేసింది.

స్పైడర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్-చెన్నై మధ్య చక్కర్లు కొడుతోంది రకుల్ ప్రీత్. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా తన కోసం ఓ కారు కొనుక్కుంది. హై-ఎండ్ మోడల్ కు చెందిన ఈ కారును ఢిల్లీలో రిజిస్టర్ చేయించారు. ఇప్పటికే రకుల్ దగ్గరున్న జాగ్వార్ కు తోడుగా ఇప్పుడీ బెంజ్ కూడా వచ్చి చేరిందన్నమాట.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్పైడర్ రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఏడాది రకుల్ కు ఇది వరుసగా నాలుగో తెలుగు సినిమా కావడం విశేషం. ఇంతకుముందు ఈమె విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయజానకి నాయక సినిమాల్లో నటించింది.