Advertisement


Home > Movies - Movie News
రకుల్‌ పిలుస్తోంది.. వెళ్ళాల్సిందే.!

టాలీవుడ్‌లో ఇప్పుడున్న హీరోయిన్లలో బిజీయెస్ట్‌ హీరోయిన్‌ ఎవరంటే, ఠక్కున రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరే చెప్పాలి. కెరీర్‌లో ఒకటీ అరా ఫ్లాపులున్నా, ఓవరాల్‌గా చూస్తే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని లక్కీ హీరోయిన్‌గానే భావించాల్సి వుంటుంది. ఓ పక్క హీరోయిన్‌గా క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తూనే, ఇంకోపక్క 'ఫిట్‌నెస్‌' వ్యాపారంలోకి అడుగు పెట్టింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 

ఆల్రెడీ హైద్రాబాద్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫిట్‌నెస్‌ వ్యాపారం ఓ రేంజ్‌లో నడుస్తోంది. తాజాగా, విశాఖపట్నంలో మరో ఫిట్‌నెస్‌ స్టూడియోతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ రోజు విశాఖ వాసుల్ని పలకరించింది. 'విశాఖని యూత్‌ ఫుల్‌ సిటీ'గా అభివర్ణించడంలోనే రకుల్‌, విశాఖ వాసుల మనసుల్ని గెలిచేసుకుంది. ఫిట్‌నెస్‌ అంటే బరువులు ఎత్తడం కాదనీ, ఫిట్‌నెస్‌ అంటే కష్టపడటం కాదనీ.. ఫిట్‌నెస్‌ అంటే జస్ట్‌ సరదాగా వర్కవుట్స్‌ చెయ్యడమేనని చెప్పింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 

హైద్రాబాద్‌తో పోల్చితే, అంతటి కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వున్న విశాఖలో ఫిట్‌నెస్‌ పట్ల అవగాహన ఎక్కువేననీ, తమ స్టూడియోలో ఫిట్‌నెస్‌ థీమ్స్‌ కష్టంగా కాకుండా, ఇష్టంగా వుంటాయని రకుల్‌ సెలవిచ్చింది. రకుల్‌ నార్త్‌ ఇండియన్‌ అయినా, గలగలా తెలుగులో మాట్లాడేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! తెలుగు నేర్చుకోవడం అనేది సినిమాలకోసమే కాదు, వ్యాపారం కోసం కూడా. ఇంత క్యూట్‌గా రకుల్‌ పిలుస్తోంటే, ఫిట్‌నెస్‌ కోసం ఆమె స్టూడియోకి వెళ్ళకుండా వుండగలరా ఎవరైనా.? 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విశాఖలో స్థాపించిన కొత్త ఫిట్‌నెస్‌ స్టూడియోకి, టాలీవుడ్‌ హీరోలు రాణా, అక్కినేని అఖిల్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి చేతుల మీదుగానే ఈ స్టూడియో ప్రారంభమయ్యింది.