Advertisement


Home > Movies - Movie News
అక్షయ్ సరసన మహేష్ బ్యూటీ

చూస్తుంటే.. 2018లో తెలుగు సినిమాలు తగ్గించాలని డిసైడ్ అయినట్టుంది రకుల్ ప్రీత్ సింగ్. గతేడాది మొత్తం తెలుగు సినిమాలకే కాల్షీట్లు ఇచ్చిన ఈ బ్యూటీ.. న్యూ ఇయర్ లో కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

తమిళ్ లో సూర్య సరసన నటించబోతోంది రకుల్. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రకుల్ ను హీరోయిన్ గా ప్రకటించారు. ఈ మూవీతో పాటు బాలీవుడ్ లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉంది.

హిందీలో సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా ఓ సినిమాను రిలీజ్ కు రెడీ చేసిన రకుల్.. త్వరలోనే అక్షయ్ కుమార్ సరసన నటించడానికి రెడీ అవుతోంది. సౌత్ హీరోయిన్లకు బ్రేక్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అక్షయ్. ఇప్పటికే కాజల్, అసిన్, శృతిహాసన్, తమన్న లాంటి హీరోయిన్లకు అవకాశమిచ్చిన ఈ హీరో.. ఇప్పుడు రకుల్ కు కూడా ఛాన్స్ ఇవ్వబోతున్నాడు.

స్పైడర్ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు రకుల్. సూర్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. మరోసారి కార్తి సరసన నటించేందుకు కూడా రెడీ అవుతోంది. ఇప్పుడు హిందీలో అక్షయ్ తో సినిమాకు కమిట్ అయింది.