Advertisement


Home > Movies - Movie News
రాజుగారి గది-2: ఇది వెంకటేష్ సినిమా

అదేంటి.. రాజుగారి గది-2లో నాగార్జున హీరో కదా. మరి మధ్యలో వెంకీ ఎక్కుడ్నుంచి వచ్చాడని అనుకుంటున్నారా. నిజమే రాజుగారి గది-2లో వెంకీ లేడు. కానీ ఈ సినిమా మాత్రం మొదట వెంకీ కోసమే అనుకున్నాడట దర్శకుడు ఓంకార్. ఆ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. 

"రాజుగారి గది-2 సినిమా కథను మొదట వెంకటేష్ కు వినిపించాను. వెంకీకి కూడా స్టోరీలైన్ బాగా నచ్చింది. కానీ అప్పటికే ఆయన గురు సినిమాకు కమిట్ అయ్యారు. దీంతో వెంటనే పీవీపీకి కథ చెప్పడం, ఓకే అయిపోవడం చకచకా జరిగిపోయాయి." 

అయితే వెంకీకి చెప్పిన కథకు, రాజుగారి గది-2కు సంబంధం లేదంటున్నాడు ఓంకార్. మలయాళంలో హిట్ అయిన ప్రేతమ్ సినిమా మూలకథను తీసుకొని రాజుగారి గది-2 తెరకెక్కించాడట. అంతేకాదు.. ఈ సినిమా హిట్ అయితే వెంకటేష్ కు చెప్పిన కథతో పార్ట్-3 తీస్తానంటున్నాడు.  

రాజుగారి గది-2 సినిమాకు పారితోషికం తీసుకోలేదు ఓంకార్. సినిమా రిలీజ్ అయి హిట్ అయితే వచ్చిన లాభాల్లో షేర్ వస్తుంది. అటు నాగార్జున కూడా అంతే. రెమ్యూనరేషన్ తీసుకోకుండా షేర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.