Advertisement


Home > Movies - Movie News
మారిన ప్లాన్.. ఈ నెలంతా ఇక్కడే

లెక్కప్రకారం ఈపాటికి దుబాయ్ వెళ్లిపోవాలి. భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభం అవ్వాలి. కానీ లెక్కలు మారాయి. సాహో యూనిట్ ఒకటనుకుంటే, రిజల్ట్ మరోలా వచ్చింది. దుబాయ్ లో షూటింగ్ కు అనుమతులు రాకపోవడంతో.. ఈ సినిమా షూటింగ్ ను ఇవాళ్టి నుంచి తిరిగి హైదరాబాద్ లోనే ప్రారంభిస్తున్నారు. 

సారధి స్టుడియోస్ లో ఈరోజు నుంచి సాహో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ప్రభాస్ తో పాటు నీల్ నితిన్ ముకేష్, శ్రద్ధాకపూర్ పై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి చేసిన షెడ్యూల్స్ ఒకెత్తు. ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న షెడ్యూల్ మరో ఎత్తు.

అవును.. సాహో సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ ఇది. ఈ నెలంతా ఇది కొనసాగుతుంది. అంతేకాదు, ఈ నెలంతా సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు ప్రభాస్. హీరో, హీరోయిన్, విలన్ నీల్ నితిన్ మధ్య సన్నివేశాలు తీస్తారు. ఈ షెడ్యూల్ తర్వాత యూనిట్ అంతా కలిసి దుబాయ్ వెళ్తుంది.

దుబాయ్, అబుదాబి, మస్కట్ లో నెల రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అనుమతులు రాలేదు. అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వెంటనే షెడ్యూల్ వివరాలు వెల్లడిస్తారు.