Advertisement


Home > Movies - Movie News
'సంఘమిత్ర'కి న్యాయం చేస్తా: దిశా పటాని

తెలుగులో తొలి సినిమా ఆమెకు పెద్ద ఫ్లాపే ఇచ్చింది. ఆమె ఇంకెవరో కాదు, దిశా పటానీ. వరుణ్‌ తేజ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'లోఫర్‌' సినిమాలో నటించిన దిశా పటానీ ఆ సినిమా ఫ్లాప్‌ అవడంతో మళ్ళీ తెలుగు తెరపై కన్పించలేదు. అయితే, ఆ ఒక్క సినిమాతో ఆమె టాలెంట్‌ని లైట్‌ తీసుకోవడానికి వీల్లేదు. దిశా మంచి డాన్సర్‌.. అంతేనా, ఆమె యాక్షన్‌ సీక్వెన్సెస్‌లోనూ బాగా చేయగలదు. ఇంకా చాలా క్వాలిటీస్‌ ఆమెలో వున్నాయి. 

ఇక, ఈ బ్యూటీకి తమిళ సినిమా 'సంఘమిత్ర'లో ఛాన్సొచ్చింది తాజాగా. గతంలో శృతిహాసన్‌ వదులుకున్న ఛాన్స్‌ ఇది. చాలామంది హీరోయిన్ల పేర్లు తెరపైకొచ్చాయిగానీ, చివరికి దిశా పటానీని ఫైనల్‌ చేశారు 'సంఘమిత్ర' చిత్ర దర్శకుడు సుందర్‌. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక ఇండియన్‌ మూవీ.. అనే స్థాయిలో భారీ బడ్జెట్‌తో 'సంఘమిత్ర'ను నిర్మిస్తున్నట్లు సుందర్‌ గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. 

ఇదిలా వుంటే, 'సంఘమిత్ర'లో ఛాన్స్‌ రావడంపై స్పందించిన దిశా పటానీ, ఆ సినిమా కథ గురించి పూర్తిగా విన్నాక, పూర్తి న్యాయం చేయగలననే నమ్మకంతోనే ఓకే చెప్పానంటోందీ బ్యూటీ. మార్షల్‌ ఆర్ట్స్‌లో తనకున్న ప్రావీణ్యం ఈ సినిమాకి ఉపయోగపడ్తాయన్నది దిశా పటానీ వాదన. సౌత్‌లో ఓ సినిమా చేశాననీ, ఆ సినిమా ఆశించిన గుర్తింపు ఇవ్వలేదనీ, 'సంఘమిత్ర'తో మాత్రం మంచి విజయం తన ఖాతాలో పడ్తుందని దిశా పటానీ ధీమా వ్యక్తం చేస్తోంది.