Home > Movies - Movie News
శర్వానంద్ కోసం మరో డైరక్టర్

అసలే తన సినిమా ముందా? వెనుకా? అని ఇద్దరు డైరక్టర్లు సుధీర్ వర్మ, ప్రకాష్ కిందామీద అవుతుంటే, మరో డైరక్టర్ సీన్లోకి వస్తన్నట్లు కనిపిస్తోంది. హీరో శర్వానంద్ కోసం ఇప్పుడు ఒక తమిళ్ డైరక్టర్ లైన్లోకి వచ్చారు. ఓ మాంచి లైన్ కూడా చెప్పేసారు. ఇప్పుడు ఆ లైన్ ను స్క్రిప్ట్ గా మార్చే పనిలో వున్నారు. అది కనుక శర్వానంద్ ఒకె చేస్తే మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు అవుతుంది.

ఇంతకీ శర్వకు కథ చెప్పిన డైకర్టర ఎవరో కాదు. తమిళనాట కాస్త పేరున్న సుశీంద్రన్. ఇతగాడు ప్రస్తుతం సందీప్ కిషన్ తో కలిసి కేరాఫ్ సూర్య అనే సినిమాను అందిస్తున్నాడు. అదే సినిమా నిర్మాత తరపున శర్వాకు కథ చెప్పినట్లు, దానికి శర్వా ఒకె చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ కథ ఎప్పుడు స్క్రిప్ట్ గా మారుతుందో? ఎప్పుడు శర్వా ఓకె చేస్తాడో చూడాలి.