Home > Movies - Movie News
ఇంటర్వెల్ తర్వాత ఆ పాట కేక

రాజా ది గ్రేట్ సినిమాకు సంబంధించి 5 పాటలతో జూక్ బాక్స్ రిలీజైంది. కానీ సినిమాలో ఉన్నవి 5పాటలు కాదు. మొత్తం 6పాటలున్నాయి. మిగిలిన ఆ ఆరో పాట వెరీ వెరీ స్పెషల్ అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతానికి అది టాప్ సీక్రెట్ అంటున్నాడు.

రాజా ది గ్రేట్ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత ఆ పాట వస్తుందట. పుష్ జోష్ తో ఉండే ఆ పాట చూడ్డానికి, వినడానికి కామెడీగా కూడా ఉంటుందట. సినిమాకు అదే పెద్ద హైలెట్ అవుతుందనే నమ్మకంతో దాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారు మేకర్స్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆ పాటను ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.

మరోవైపు తమ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఉన్నాడంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. రాజా ది గ్రేట్ లో రాశి ఖన్నా మాత్రమే ఉందని, సాయిధరమ్ తేజ్ కనిపించడని అంటున్నాడు. కేవలం రాశికి తోడుగా మాత్రమే సాయిధరమ్ తేజ్ సెట్స్ కు వచ్చాడని, సినిమాలో కనిపించడని అంటున్నాడు.