Advertisement


Home > Movies - Movie News
సైరా సెట్ లో సెల్ఫీల సందడి

ఎట్టకేలకు చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి సెట్స్ పైకి వచ్చింది. ఈరోజు ఉదయం సరిగ్గా 7 గంటల 30నిమిషాలకు ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. ఎన్నో అడ్డంకులు అధిగమించి సినిమా సెట్స్ పైకి రావడంతో యూనిట్ అంతా పండగ చేసుకుంది. ఫస్ట్ డే షూట్ కావడంతో పెద్దగా సీరియస్ నెస్ కనిపించలేదు. దాదాపు యూనిట్ లో సభ్యులంతా సెల్ఫీలతో సందడిగా కనిపించారు.

నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, డీవోపీ రత్నవేలు సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలతో పాటు రెగ్యులర్ షూట్ కోసం సన్నద్ధమౌతున్నపుడు తీసిన ఓ 10సెకెన్ల వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కొణెదల ప్రొడక్షన్స్ అఫీషియల్ పేజ్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో సైరా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈవారం కేవలం చిరంజీవిపైనే కొన్ని మాంటేజ్ షాట్స్ తీయబోతున్నారు.  వీటితో పాటు 3డైలాగ్ వెర్షన్స్ షూట్ కూడా ఉంది. 

నెక్ట్స్ షెడ్యూల్ పై యూనిట్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లెక్కప్రకారం జైపూర్ లో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ చలి ప్రభావం ఎక్కువగా ఉండడంతో.. ఉత్తరాది షెడ్యూల్ డైలమాలో పడింది. దాని బదులు హైదరాబాద్ లోనే షూటింగ్ కొనసాగించే అవకాశాలున్నాయి.