Advertisement


Home > Movies - Movie News
రూమర్లకు చెక్ పెట్టిన ప్రభాస్ హీరోయిన్

త్వరలోనే ప్రభాస్ తో కలిసి సాహో సినిమా సెట్స్ పైకి రాబోతోంది శ్రద్ధాకపూర్. ఇంకా సెట్స్ పైకి రానప్పటికీ శ్రద్ధ రోల్ పై అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి. సాహో సినిమాలో శ్రద్ధాకపూర్ డ్యూయల్ రోల్ (ద్విపాత్రాభినయం) చేయనుందనే వార్త టాలీవుడ్ ను కమ్మేసింది. ఈ సినిమాపై రియాక్ట్ అవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉండే శ్రద్ధాకపూర్.. పుకార్లపై స్పందించింది.

"సాహో సినిమాలో నాది చాలా ఇంట్రెస్టింగ్ రోల్. కానీ మీడియాలో వచ్చినట్టు నేను ఇందులో డ్యూయల్ రోల్ చేయడం లేదు. చేసేది ఒకే పాత్ర అయినప్పటికీ చాలా షేడ్స్ మాత్రం ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇందులో నేను ఫైట్స్ కూడా చేస్తాను." సాహోలో తన క్యారెక్టర్ పై ఇలా క్లారిటీ ఇచ్చింది శ్రద్ధాకపూర్.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు నేర్చుకునే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికిప్పుడు తెలుగు అర్థం కాకపోయినప్పటికీ.. తడబడకుండా డైలాగ్స్ చెబితే చాలంటోంది. సాహో కంప్లీట్ అయ్యేసరికి తెలుగు అర్థం చేసుకుంటానని చెబుతోంది శ్రద్ధా.