Advertisement


Home > Movies - Movie News
సిద్దూ.. ఇది మరీ టూమచ్‌ కదా.!

'18 ఏళ్ళ లోపు వయసు పిల్లలు ఈ సినిమా చూడొద్దు.. ఆ పై వయసున్నోళ్ళు మాత్రం చూడొచ్చు.. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు సినిమాని చూడకపోవడమే మంచిది..' 

- హీరో సిద్ధార్థ తన కొత్త సినిమా 'గృహం' గురించి చేస్తోన్న అప్పీల్‌ ఇది. 

మామూలుగా అయితే, ఎవరూ ఇలాంటి మాటలు చెప్పరు. ఎలాగూ సెన్సార్‌ బోర్డ్‌ ఓ సర్టిఫికెట్‌ ఇచ్చేస్తుంది గనుక, ప్రత్యేకంగా ఆ సినిమాని ఫలానా సెక్షన్‌ చూడొద్దని చెప్పడం వెరైటీనే. 'గృహం' సినిమా హర్రర్‌ సినిమాల్ని ఇష్టపడేవారిని ఆకట్టుకుంటోన్న విషయం విదితమే. ఆ సంగతి పక్కన పెడితే, సినిమాలో 'ఓవర్‌ ది బోర్డ్‌' అనేలా 'బోల్డ్‌ కంటెంట్‌' వుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

ఇదే విషయాన్ని హీరో సిద్దార్ధ దృష్టికి తీసుకెళితే, కొంచెం కొత్తగా ఇంకొంచెం వింతగా సమాధానమిచ్చాడు. 'మా అమ్మకి సినిమా చూపించా.. అందులో బోల్డ్‌ కంటెంట్‌ గురించి అభిప్రాయం అడిగా. ఇందులో తప్పేముంది.? సహజంగానే వుంది కదా.! అని మా అమ్మ నాకు చెప్పింది. సో, మేటర్‌ క్లియర్‌..' అని తేల్చేశాడు సిద్దార్ధ. ఇది మరీ టూమచ్‌. అంత బోల్డ్‌ కంటెంట్‌ వున్న సినిమాని తల్లికి చూపించడం, ఆమె అభిప్రాయం తెలుసుకోవడం.. కాస్త ఓవర్‌గా లేదూ.! 

అయినా, ఈ రోజుల్లో ఇలాంటి 'బోల్డ్‌ కంటెంట్‌' అంత సీరియస్‌ విషయమే కాదు. దానికి 'అమ్మ'ని సాక్షిగా చూపడం ఏమాత్రం సబబు కాదు. సిద్దూ ఇలాంటి విషయాల్లో కొంచెం 'అతి' చేస్తుంటాడు. ఇక్కడా అదే చేశాడు.