Home > Movies - Movie News
ఇరానీ కేఫ్ లో పవన్ ఫైట్స్

పవన్-త్రివిక్రమ్ కలిశారంటే ఓ స్టయిలిష్ ఫైట్ గ్యారెంటీ. అత్తారింటికి దారేది సినిమాలో ఫస్ట్ ఫైట్ ఇప్పటికీ అందరికీ గుర్తే. పవన్ ను ఇంట్రడ్యూస్ చేస్తూనే, అదిరిపోయే ఫైట్ పెట్టాడు త్రివిక్రమ్. ఇప్పుడు కొత్త సినిమా కోసం కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. కాకపోతే ఈసారి లొకేషన్ మారింది.

ఇరానీ కేఫ్ బ్యాక్ గ్రౌండ్ లో పవన్ పై ఓ ఫైట్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఈ ఫైట్ కోసం సారధి స్టుడియోస్ లో ఏకంగా ఓ స్టయిలిష్ ఇరానీ కేఫ్ సెట్ వేశారు. అందులోనే పవన్ పై సరికొత్తగా ఓ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ ఉంటుంది.

హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పవన్-త్రివిక్రమ్ సినిమాకు ఇంకా పేరుపెట్టలేదు.