Advertisement


Home > Movies - Movie News
రాజుగారి గది-2లో సుచి లీక్స్

సౌత్ అంతటా సంచలనం సృష్టించిన సుచిలీక్స్ వ్యవహారం ఇంకా కొంతమందిని భయపెడుతూనే ఉంది. ఎప్పుడు ఎవరి ఫొటోలు లీక్ అవుతాయో అనే టెన్షన్ కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు సుచిలీక్స్ పార్ట్-2 కూడా ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ వివాదం ఇంకా హాట్ హాట్ గానే ఉంది. కొంతమంది కోలీవుడ్ నటీనటుల్ని వణికించిన ఈ ఉదంతం రాజుగారి గది-2లో కూడా ఉంది.

నిజానికి రాజుగారి గది-2లో కీలకమైన పాయింట్ కూడా ఇదే. రహస్యంగా ఫొటోలు, వీడియోల్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడితే, ఆ అమ్మాయి పడే వేదన ఏంటనేది రాజుగారి గది-2లో కీలకమైన పాయింట్. అక్కడ్నుంచే ఆత్మ అనే కాన్సెప్ట్ మొదలవుతుంది. అలా బలైపోయిన అమృత అనే లాయర్.. తనకు అన్యాయం చేసిన వాళ్లపై ఎలా ప్రతీకారం తీర్చుకుందనేదే రాజుగారి గది-2 స్టోరీ.

తన పాత్రకు సంబంధించి సమంత కూడా క్లారిటీ ఇచ్చింది. "నా పాత్ర ప్రతి అమ్మాయికి దగ్గరగా ఉంటుంది. సుచి లీక్స్ ఎవరైతే ప్రారంభించారో.. ఎవరు షేర్ చేశారో వాళ్లందరికీ ఓ సందేశం ఇస్తుంది ఈ సినిమా. కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాల్లో నేను గ్లిజరిన్ వాడకపోవడానికి కారణం కూడా అదే. సుచి లీక్స్ ఉదంతం, బాధిత అమ్మాయిల ఆవేదన గుర్తు తెచ్చుకొని నటించాను."

రాజుగారి గది-2 ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. రుద్ర అనే మెంటలిస్ట్ గా నాగార్జున పోషించిన పాత్ర సినిమాకే హైలెట్ అంటోంది యూనిట్. ఆ తర్వాత సమంత పోషించిన అమృత పాత్ర హైలెట్ అవుతుందని చెబుతోంది.