Advertisement


Home > Movies - Movie News
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో సునీల్!

మొన్నటివరకు ఓన్లీ హీరో వేషాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆడియన్స్ మాత్రం సునీల్ కామెడీ చేయాలని కోరుకుంటున్నారు. ఎట్టకేలకు కామెడీ పాత్రలపై నిర్ణయం తీసుకున్నాడు సునీల్. ఇతర హీరోల సినిమాల్లో కామెడీ రోల్స్ చేసేందుకు ఒప్పుకున్నాడు. కాకపోతే ఓ వైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు కామెడీ రోల్స్ కూడా చేస్తానంటున్నాడు.

“కామెడీ పాత్రలు వేయాలని నిర్ణయించుకున్నాను. హీరోగా నటిస్తుంటే ప్రేక్షకులకు నాకు మధ్య గ్యాప్ ఎక్కువగా వస్తోంది. రెగ్యులర్ గా తెరపై కనిపించట్లేదు. అందుకే హీరోగా నటిస్తూనే మరోవైపు కామెడీ పాత్రలు కూడా చేస్తా.

నిజానికి ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది స్టార్టింగ్ లోనే అమలు చేద్దాం అనుకున్నాను. కానీ నా నిర్మాతలు ఒప్పుకోలేదు. ఇకపై ఏ సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నా, బయట సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేస్తాననే క్లాజ్ పెట్టి సంతకం చేస్తా” కమెడియన్ గా కూడా కంటిన్యూ అవుతానంటూ సునీల్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది.

హీరోగా కొనసాగుతున్న సునీల్ కెరీర్ ను చెడగొట్టడం ఇష్టంలేకనే అతడికి కామెడీ రోల్స్ ఇవ్వడం లేదని గతంలో త్రివిక్రమ్ ప్రకటించాడు. ఇప్పుడు కామెడీ పాత్రలకు సునీల్ సై అనడంతో.. త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాలో అతడు కమెడియన్ గా కనిపించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేస్తున్న త్రివిక్రమ్.. తన నెక్ట్స్ మూవీని ఎన్టీఆర్ తో ప్లాన్ చేశాడు. ఈ మూవీలో సునీల్ కు త్రివిక్రమ్ ఓ మంచి క్యారెక్టర్ ఇవ్వడం గ్యారెంటీ.