Advertisement


Home > Movies - Movie News
'మనం' సినిమాపై సూర్య రియాక్షన్

అక్కినేని 3తరాల హీరోలు కలిసి నటించిన సినిమా మనం. అన్నపూర్ణ బ్యానర్ చరిత్రలోనే మరపురాని చిత్రంగా నిలిచిపోయింది మనం. అలాంటి సినిమాను తమిళ్ లో రీమేక్ చేయాలని అనుకున్నాడట సూర్య. ఆ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు. ఆ సినిమా రీమేక్ ఎందుకు వర్కవుట్ అవ్వలేదో కూడా వివరించాడు.

"మనం సినిమాను తమిళ్ లో రీమేక్ చేయాలనుకున్నాం. నేను, కార్తి, మా తండ్రి శివకుమార్ కలిసి నటించాలనుకున్నాం. విక్రమ్ కుమార్ ను కలిసింది కూడా అందుకే.  కానీ ఆ ప్రాజెక్టు వర్కవుట్ కాలేదు. అప్పుడే '24' సినిమా స్టోరీ చెప్పాడు. అలా మనం రీమేక్ మిస్ అయింది." గ్యాంగ్ మూవీ ప్రమోషన్ లో సూర్య చెప్పిన విషయం ఇది.

ఏదైనా మేజిక్ జరిగినప్పుడు దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకోవడం తప్పంటున్నాడు సూర్య. ప్రతిసారి అదే మేజిక్ వర్కవుట్ అవుతుందని చెప్పలేమని.. అందుకే మనం రీమేక్ నుంచి డ్రాప్ అయ్యామని వివరించాడు.

గ్యాంగ్ సినిమా స్టోరీలైన్ పై స్పందించాడు సూర్య. 1980, 87లో జరిగిన చోరీల ఆధారంగా స్పెషల్ ఛబ్బీస్ తెరకెక్కిందని.. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్యాంగ్ ను రూపొందించామని ప్రకటించాడు. గ్యాంగ్ కూడా యదార్థ ఘటనల ఆధారంగానే తెరకెక్కినప్పటికీ.. స్క్రీన్ ప్లే అంతా కొత్తగా ఉంటుందంటున్నాడు.