Home > Movies - Movie News
సుశాంత్ కు పితృవియోగం

వ్యాపార వేత్త, అక్కినేని వారి ఇంటి అల్లుడు అనుమోలు సత్య భూషణ రావు మృతి చెందారు. నిర్మాత నాగ సుశీల భర్త ఆయన. అలాగే హీరో సుశాంత్ కు తండ్రి. గత కొంతకాలంగా ఆయన ఇంటికే పరిమితమై వుంటున్నారు. బుధవారం రాత్రి 11.40 గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు.

అనుమోలు వారి కుటుంబం కూడా సినిమా నిర్మాణంలోనే వుండేది. అయితే ఈయన మాత్రం వ్యాపారాల్లోకి వచ్చారు. కొన్నాళ్లు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా నడిపారు. అయితే చిరకాలంగా అన్నీ వదిలేసి, ఇంట్లోనే వుంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. కుమారుడు సుశాంత్ హీరోగా వున్నారు. ఒక కుమార్తెకు వివాహం జరిగింది.