Advertisement


Home > Movies - Movie News
రానా గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు

ఇండస్ట్రీలో ముక్కుసూటిగా ఉండే వ్యక్తులు చాలా కొద్దిమంది. అలాంటి వారిలో ముందుంటాడు దర్శకుడు తేజ. తన వ్యక్తిత్వాన్ని, స్టయిల్ ను మరొకరి కోసం మార్చుకోడు. అలాంటి వ్యక్తి రానా లాంటి ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోతో సినిమా చేశాడు. అప్పుడే చాలామంది అనుమానించారు. తేజ కాస్త తగ్గాడని అనుకున్నారు. అలాంటి తెరవెనక విషయాలపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు తేజ. 

"ఫస్ట్ కథ అనుకొని రానాకు చెప్పాం. స్టోరీలైన్ రానాకు నచ్చి ఓకే చెప్పేశాడు. ప్రొడ్యూసర్ సురేష్ బాబుతో డిస్కషన్స్ కు కూర్చున్న టైమ్ లో రానా లేడు. సగం డిస్కషన్లు జరిగిన తర్వాత ఎంటరయ్యాడు రానా. గెస్ట్ హౌజ్ లో నేను, సురేష్ బాబు ఉన్నాం. లోపలికి వస్తూనే నాకు నచ్చినట్టు చేస్తాను, మీకు నచ్చినట్టు నేను చేయనని తెగేసి చెప్పేశాడు రానా. ఓకే అంటేనే లోపలికి వస్తానని కండిషన్ పెట్టాడు". రానాపై ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేశాడు తేజ.

రానా కండిషన్ కు కొంతమేరకు ఒప్పుకున్న తర్వాతే సినిమా స్టార్ట్ అయిందంటున్నాడు తేజ. అంటే ఈ విషయంలో తేజ కాస్త తగ్గాడనే అనుకోవాలి. అయితే నేనే రాజు నేనే మంత్రి స్క్రిప్ట్ కు న్యాయం చేయగల హీరో మాత్రం రానా తప్పిస్తే మరొకరు పరిశ్రమలో లేరని మెచ్చుకున్నాడు తేజ. 

బాహుబలిలో విలన్ గా కూడా కనిపించడం ఈ సినిమాలో రానాకు బాగా కలిసొచ్చిందన్నాడు. తను కూడా ఓ హిట్ సినిమా తీయగలనని ఇన్నాళ్లకు తెలిసొచ్చిందంటూ ఫైనల్ గా తనపై తానే సెటైర్ వేసుకున్నాడు తేజ.