Advertisement


Home > Movies - Movie News
దటీజ్ నారా రోహిత్

ఒక హీరో సినిమా విడుదలవుతోంది అంటే, అతని దృష్టి అంతా దానిపైనే వుంటుంది. తన సినిమా బాగా ఆడాలని, మంచి సమీక్షలు రావాలని పైకి కాకున్నా, లోపలన్నా అనుకోవడం పక్కా. అయితే తన సినిమాతో పాటు మిగిలిన సినిమాలు కూడా బాగా ఆడాలని పైకి ఓ స్టేట్ మెంట్ పడేయడం కూడా అలవాటే. కానీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, కెరీర్ లో సరైన సక్సెస్ ను వెదుక్కుంటున్న నారా రోహిత్ మాత్రం పూర్తిగా డిఫరెంట్.

ఈవారం విడుదలవుతున్న సినిమాల్లో ఒకటి నారా రోహిత్ బాలకృష్ణుడు. మరోటి శ్రీ విష్ణు 'మెంటల్ మదిలో'. బాలకృష్ణుడు సినిమా రోహిత్ ఓ బ్రేక్ కోసం ట్రయ్ చేసిన మాస్ మసాలా కమర్షియల్ సినిమా. ఇక శ్రీవిష్ణు సంగతి వేరు. ఇప్పుడిప్పుడే హీరోగా ఒకటికి రెండు అవకాశాలు

అందిపుచ్చుకోవాలని చూస్తున్నాడు శ్రీవిష్ణు. అందుకే శ్రీవిష్ణు సినిమా ఎలాగైనా బాగుండాలని, మంచి సమీక్షలు రావాలని, మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాడట నారా రొహిత్. అంతే కాదు, ఆ సినిమాకు మాంచి పబ్లిసిటీ వుండాలని, మంచి హైప్ రావాలని తనకు తెలిసిన మీడియా మిత్రుల వద్ద తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడట.

ఏమిటీ? రోహిత్ వైఖరి. తన సినిమా వుండగా, పోటీ సినిమా మీద ఇంత ఆసక్తి అంటే, తెలిసిన విషయం ఏమిటంటే, గతంలో నారా రోహిత్ ఓ దశలో ఒంటరి అయిపోయిన సందర్భంలో శ్రీ విష్ణునే పక్కన వీడకుండా వున్నాడట. ఇప్పుడు నారా రోహిత్ చుట్టూ చాలా మంది వున్నా, తనను కష్టకాలంలో అంటి పెట్టుకుని వున్న శ్రీ విష్ణు అంటే రోహిత్ కు చాలా ఇష్టం అంట. అందుకే ఎలాగైనా శ్రీవిష్ణు హీరోగా నిలదొక్కుకోవాలని, అతని సినిమా హిట్ కావాలని రోహిత్ కోరుకుంటున్నాడట.