Advertisement


Home > Movies - Movie News
ఉందా.. లేదా: అయోమయంలో త్రిష

ఊహించని విధంగా ఓ సినిమా త్రిష మెడకు చుట్టుకుంది. అది కూడా మామూలు సినిమా కాదు. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్. విక్రమ్ హీరోగా నటిస్తున్న సామి స్క్వేర్ మూవీ. ఈ సినిమా నుంచి త్రిష తప్పుకుంది. కానీ కష్టాలు మాత్రం తప్పలేదు.

సామి స్క్వేర్ సినిమాలో మొదట త్రిషనే తీసుకున్నారు. అగ్రిమెంట్ పూర్తయింది. అడ్వాన్స్ కూడా తీసుకుంది. కానీ అంతలోనే కీర్తిసురేష్ కూడా ఎంటరైంది. తన క్యారెక్టర్ కంటే కీర్తి పాత్రకు ఎక్కువ స్కోప్ ఉండడంతో త్రిష తప్పుకుంది. 

తను తప్పుకుంటున్న విషయాన్ని ఆఫీషియల్ గా కూడా ప్రకటించింది అప్పట్లో. కానీ మేకర్స్ మాత్రం నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. త్రిష వల్ల తమకు ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లిందని ఆరోపించారు. త్రిష నుంచి తాము డబ్బులు ఆశించడం లేదని, ఆమె ఒప్పుకున్న పాత్ర చేస్తే చాలని కోరుతున్నారు.

దీంతో త్రిష ఇప్పుడు అయోమంలో పడిపోయింది. విక్రమ్ సినిమాలో నటిస్తే అది కీర్తిసురేష్ కంటే చిన్న పాత్ర అవుతుంది. నటించకపోతే నడిగర్ సంఘం ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. మరోవైపు ఈ సినిమాకు కేటాయించిన కాల్షీట్లను మరో సినిమాకు ఇచ్చేసింది త్రిష. దీంతో ఆమె కష్టాలు రెట్టింపు అయ్యాయి.