Home > Movies - Movie News
త్వరలో బాహుబలి థాంక్స్ మీట్

బాహుబలి 2 అపూర్వ విజయం సాధించింది. బాహుబలి పార్ట్ వన్ కు తెలుగునాట క్రిటిక్స్ అండ్ మీడియా అప్లాజ్ అంతగా రాలేదు. కానీ పార్ట్ 2 విషయానికి వస్తే అది కూడా సాధించారు. అందుకే బాహుబలి 2 విడుదలకు ముందు తెలుగు మీడియాను అంతగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు ఓ థాంక్స్ మీట్ పెట్టేస్తే పోలా అని ఆలోచిస్తున్నారట, నిర్మాతలు, దర్శకుడు. ఇంతలా సహకరించిన తెలుగు మీడియాకు ఓ సాయంత్రం థాంక్స్ గివెన్ మీట్ పెట్టాలని డిసైడ్ అయ్యారట.

యూరప్ నుంచి, ఇక్కడ పనులు చక్క బెట్టుకుని, త్వరలో లాంగ్ రెస్ట్ టూర్ కు విదేశాలకు వెళ్లబోతున్నారు దర్శకుడు రాజమౌళి. అలా వెళ్లే లోగానే ఈ థాంక్స్ మీట్ పెట్టాలని చూస్తున్నారు. అయితే నిర్మాతలు, రాజమౌళి, ఫ్రభాస్, రానా అందరికీ సెట్ అయ్యే డేట్ కోసం చూస్తున్నారు. ఇదిలా వుంటే అమెజాన్ ప్రయిమ్ లో బాహుబలి కామిక్ 2డి సీరీస్ స్టార్ట్ అయింది. ప్రతివారం ఓ ఎపిసోడ్ వాచ్ చేయచ్చు.